AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Subhashini : సీఎం కేసీఆర్ నా ప్రాణ దాత ఆయన లేకపోతే.. కన్నీరు పెట్టుకున్న నటి అల్లరి సుభాషిణి.

అల్లరి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాషిణి. ఆ సినిమా తర్వాత ఆమె పేరు అల్లరి సుమభాషిణిగా మారిపోయింది. లేడీ కమెడియన్‌‌‌‌గా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన సుభాషిణి..

Allari Subhashini : సీఎం కేసీఆర్ నా ప్రాణ దాత ఆయన లేకపోతే.. కన్నీరు పెట్టుకున్న నటి అల్లరి సుభాషిణి.
Subashini
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2021 | 10:04 PM

Share

Allari Subhashini : అల్లరి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాషిణి. ఆ సినిమా తర్వాత ఆమె పేరు అల్లరి సుభాషిణిగా మారిపోయింది. లేడీ కమెడియన్‌‌‌‌గా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన సుభాషిణి.. కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె సినిమాలో కనిపించి చాలా కాలం అయ్యింది. తాజాగా ఆమె ఓ కామెడీ షో ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సినిమాలకు గ్యాప్ రావడంపై సుభాషిణి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగానే సినిమాలకు గ్యాప్ ఇచ్చానని అన్నారు. నీరసంగా ఉంటుందని ఆసుపత్రికెళ్లి చూపించుకుంటే క్యానర్ అని తెలిసిందని అన్నారు. ఆపరేషన్‌‌కు దాదాపు 15 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఆసమయంలో ఏం చేయాలో తెలియలేదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సాయం అందించారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

చికిత్స కోసం సాయం చేయమని అడగడానికి తెలంగాణ ప్రగతి భవన్‌‌‌‌కు వెళ్ళాను.. అక్కడున్నవాళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారు. వెంటనే అక్కడి వారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన వెంటనే ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బును సాంక్షన్ చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా నాకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగింది. కేవలం మూడు రోజుల్లోనే ఆపరేషన్ అయిపోయింది. నా జీవితకాలం కేసీఆర్‌‌‌‌గారికి రుణపడి ఉంటాను. అయన నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు సుభాషిణి, అలాగే ఇండస్ట్రీ వారు కూడా నాకు ఆర్ధికంగా సాయం అందించారు. అలాగే మా అసోసియేషన్ లక్షరూపాయలు అందించింది, మెగాస్టార్ చిరంజీవిగారు, నాగబాబుగారు ఆర్థికంగా సాయం అందించారు. ఇక త్వరలోనే తిరిగి సినిమాల్లోకి వచ్చేస్తా అన్నారు. ప్రస్తుతం మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అని అన్నారు సుభాషిణి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers : ఇలా చేస్తే సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది.. ఆవేదన వ్యక్తం చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత

Sakala Gunabhi Rama: యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ.. ఈ యంగ్ హీరో బిగ్ బాస్‌‌‌‌లోకి కూడా వెళ్తున్నాడట..

Nisha Agarwal: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు… సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సిస్టర్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే