AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Venkatesh: వెబ్‌ సిరీస్‌లో సందడి చేయనున్న బాబాయ్‌, అబ్బాయ్‌.. ఆ హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇందులోనేనా?

Rana Venkatesh: వెండి తెరపై కొన్ని కాంబినేషన్‌లపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. రియల్‌ లైఫ్‌లో బంధుత్వం ఉన్న వారు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయడాన్ని ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు...

Rana Venkatesh: వెబ్‌ సిరీస్‌లో సందడి చేయనున్న బాబాయ్‌, అబ్బాయ్‌.. ఆ హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇందులోనేనా?
Rana Venky
Narender Vaitla
|

Updated on: Aug 17, 2021 | 3:04 PM

Share

Rana Venkatesh: వెండి తెరపై కొన్ని కాంబినేషన్‌లపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. రియల్‌ లైఫ్‌లో బంధుత్వం ఉన్న వారు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయడాన్ని ఫ్యాన్స్‌ ఇష్టపడుతుంటారు కూడా. ఇక మేకర్స్‌ కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒకే సినిమాతో ఇద్దరు స్టార్‌ల అభిమానులను ఆకర్షిస్తుంటారు. ఇందుకోసం రకరకాల కాంబినేషన్‌లను సెట్‌ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైంది. కానీ తొలిసారి ఈ ట్రెండ్‌ వెబ్‌ సిరీస్‌కు కూడా పాకుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం బాబాయ్‌ వెంకటేష్‌, అబ్బాయ్‌ రానాలు కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరు కనిపించబోయేది ఓ వెబ్‌ సిరీస్‌లోనని సమాచారం.

Rana

ఓ బడా ఓటీటీ సంస్థ ఈ ఇద్దరు స్టార్‌ హీరోలతో వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఈ ఇద్దరు హీరోలు.. ‘మంచి కథ కుదిరితే వెబ్‌ సిరీస్‌ చేయడానికి అభ్యంతరం లేద’ని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇదిలా ఉంటే గతంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో వెంకటేష్‌ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వీరు ఫుల్‌ లెంత్‌ సినిమాలో కలిసి నటించనున్నారనే వార్త అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాజల్‌ చెల్లి రీ ఎంట్రీ ఈ వెబ్‌ సిరీస్‌తోనేనా.?

ఇక ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ 2014 తర్వాత వెండి తెరకు బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వివాహం ఆ తర్వాత చిన్నారికి జన్మనివ్వడంతో నిషా సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. అయితే తాజాగా ఈ అందాల తార వెంకీ, రానా నటించనున్న వెబ్‌ సిరీస్‌ ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిషా ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొన్ని  ఫొటోలతో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మేకర్స్‌ ఓ ముఖ్యమైన పాత్ర కోసం నిషాను అప్రోచ్‌ అయ్యారని దీనికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Happy Birthday Shankar: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కెరీర్‏లో నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలు ఇవే.

Prakash Raj: జిమ్‏లో మెగాస్టార్‏ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..

VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..