AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Shankar: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కెరీర్‏లో నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలు ఇవే.

టెక్నాలజీ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దిట్ట.

Happy Birthday Shankar: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కెరీర్‏లో నేషనల్ అవార్డు అందుకున్న సినిమాలు ఇవే.
Shankar
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 17, 2021 | 2:09 PM

Share

టెక్నాలజీ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దిట్ట. తమిళ సినీ పరిశ్రమకు చెందిన శంకర్ రూపొందించిన సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. దక్షిణాది సినీ పరిశ్రమకు పాన్ ఇండియాకు పరిచయడం చేసింది కూడా శంకర్ అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఇప్పటివరకు శంకర్ నేరుగా ఒక్కసినిమాక కూడా చేయలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ వంటి చిత్రాలను తెరకెక్కించిన శంకర్ ఇప్పటికీ తన హావా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈరోజు ఆగస్ట్ 17న శంకర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. తను తెరకెక్కించిన సినిమాలలో నేషనల్ అవార్డ్ అందుకున్న సినిమాల గురించి తెలుసుకుందామా.

అన్నీయన్ (అపరిచితుడు) (2005).. టాలెంటెడ్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన అన్నీయన్ సినిమా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. తమిళ చిత్రసీమలో సామాజిక ఉదాసీనత ఆధారంగా రూపొందించారు. ఫ్యాషన్ మోడల్, సీరియల్ కిల్లర్‏గా మారిన అహంభావాలను అభివృద్ధి చేసే చట్టాన్ని పాటించే వినియోగదారుల రక్షణ లాయర్ రామానుజం అయ్యంగార్ చుట్టూ తిరుగుతుంది. ప్రపంచాన్ని మార్చేందుకు రామానుజం హత్య మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఈ సినిమాలో చూపించారు… సైకలాజికల్ థ్రిల్లర్ విక్రమ కెరీర్‏లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

శివాజీ ది బాస్ (2007) రజిని కాంత్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఇది. ఈ మూవీ మొత్తం ఎన్ఆర్ఐ చుట్టూ తిరుగుతుంది. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చిన ఒక ఎన్ఆర్ఐకు అధికారం, అవినీతి రూపంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమిస్తాడు. ఎలా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు అనేది సినిమా. ఇందులో శ్రియా హీరోయిన్‏గా నటించింది.

ఐ (2015) విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ రూపొందించిన సినిమా ఐ. ఇందులో విక్రమ్ బాడీబిల్డర్‌గా సూపర్ మోడల్‌గా కనిపించాడు. గిట్టని వారు చేసిన ప్రయోగం వలన పూర్తి వైకల్యానికి గురైన.. తన కష్టాలను ఎదుర్కోంటూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

రోబో.. (2010) సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాతో రూపొందించి రోబో సినిమాతో శంకర్ హాలీవుడ్ స్టార్ డమ్ అందుకున్నాడు. భావోద్వేగాలను పెంచుకుని.. అనర్థాలకు దారితీసే ఒక హ్యూమనాయిడ్ రోబో కథే ఈ సినిమా. యానిమేషన్, VFXలో శంకర్ విజన్ ప్రదర్శించాడు. ఇందులో రజినీ కాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు. ఈ సినిమా జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.

ఇండియన్ (1996) కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఇండియన్. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కమల్ 70 ఏళ్ల మాజీ స్వాతంత్ర సమరయోధుడుగా దేశంలో జరుగుతున్న అవినీతి కారణంగా తను ఎలా ఆ అవినీతి మార్గాన్ని నియంత్రించాడనే ఈ సినిమా. అతను ప్రతి అవినీతి అధికారిని చంపి, దేశంలో ఆర్డర్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఒక హత్యకు ఉపక్రమించాడు. వరుస హత్యలు, బ్రిటిష్ కాలం నాటి ఫ్లాష్‌బ్యాక్, యాక్షన్ కొరియోగ్రఫీ,1996 చిత్రం దాని సమయానికి చాలా ముందుందని నిరూపించాయి.

Also Read: Afghanistan Crises: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన భారత హోంశాఖ.. అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 142మంది ప్రవాసులు

CM KCR: ట్రెండ్ సెట్ట‌ర్ సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కీలక నిర్ణయాలు

Srisialam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి సర్వదర్శనానికి అనుమతి