Small Savings Schemes: ఇందులో ఎలాంటి మార్పు లేదు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ!
Small Savings Schemes: కేంద్ర ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు పోస్టాఫీసు పథకాలు, కొన్ని పథకాలు వాణిజ్య బ్యాంకులలో కూడా అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర మొదలైన పథకాలు జాబితాలో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన అత్యధిక వడ్డీ రేటును..

Small Savings Schemes: కేంద్ర ప్రభుత్వం రాబోయే త్రైమాసికానికి వివిధ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న త్రైమాసికానికి పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ సహా వివిధ చిన్న పొదుపు పథకాలకు మునుపటి వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా ఐదు త్రైమాసికాలుగా వడ్డీ రేటులో మార్పు జరగలేదు. ఏప్రిల్ 1, 2024 నుండి జూన్ 30, 2025 తో ముగిసే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉన్న రేట్లే కొనసాగుతాయరి ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు పోస్టాఫీసు పథకాలు, కొన్ని పథకాలు వాణిజ్య బ్యాంకులలో కూడా అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర మొదలైన పథకాలు జాబితాలో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన అత్యధిక వడ్డీ రేటును కలిగి ఉంది. వివిధ చిన్న పొదుపు పథకాల వివరాలు, వాటి తాజా వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
- పొదుపు డిపాజిట్: 4 శాతం వడ్డీ
- ఒక సంవత్సరం టైమ్ డిపాజిట్: 6.9 శాతం
- రెండేళ్ల టైమ్ డిపాజిట్: 7 శాతం
- మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్: 7.1 శాతం
- ఐదు సంవత్సరాల టైమ్ డిపాజిట్: 7.5 శాతం
- ఐదేళ్ల RD: 6.7 శాతం
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
- నెలవారీ ఆదాయ పథకం: 7.4 శాతం
- జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం: 7.7 శాతం
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం: 7.1 శాతం
- కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం
- సుకన్య సమృద్ధి ఖాతా: 8.2 శాతం
పోస్టాఫీసులో తెరిచిన పొదుపు ఖాతాలో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీని సేవింగ్స్ డిపాజిట్ రేటు అంటారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఐదు సంవత్సరాలలో మెచ్యూరిటీ చెందే ఏకమొత్తం పెట్టుబడి పథకం. పెట్టుబడిదారులు కోరుకుంటే ఈ కాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. కిసాన్ వికాస్ పత్ర కూడా ఏకమొత్తం పెట్టుబడి, 124 నెలల పరిపక్వత వ్యవధిని కలిగి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రోత్సహిస్తాయి. సంవత్సరానికి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి ఖాతాను ఆడపిల్ల పేరు మీద తెరవవచ్చు. అలాగే పీపీఎఫ్ ఖాతాను ఎవరైనా తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి