AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pressure Cooker Rubber: మీ ప్రెషర్ కుక్కర్‌ రబ్బరు వదులైందా? కొత్తది కొనకుండానే చిటికెలో పరిష్కారం..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కిచెన్‌ పనులు సులువుగా చేయడానికి కుక్కర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్నం, పప్పు.. వంటివి కుక్కర్ లేకుండా చేయడం కష్టమైన పని. కానీ కొన్నిసార్లు కుక్కర్ రబ్బరు వదులుగా మారుతుంది. దీంతో ఆవిరి బయటకు రావడం వల్ల విజిల్ వినిపించదు. ఇలాంటి సందర్భాలలో..

Pressure Cooker Rubber: మీ ప్రెషర్ కుక్కర్‌ రబ్బరు వదులైందా? కొత్తది కొనకుండానే చిటికెలో పరిష్కారం..
Pressure Cooker Rubber
Srilakshmi C
|

Updated on: Jan 01, 2026 | 1:03 PM

Share

ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కిచెన్‌ పనులు సులువుగా చేయడానికి కుక్కర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్నం, పప్పు.. వంటివి కుక్కర్ లేకుండా చేయడం కష్టమైన పని. కానీ కొన్నిసార్లు కుక్కర్ రబ్బరు వదులుగా మారుతుంది. దీంతో ఆవిరి బయటకు రావడం వల్ల విజిల్ వినిపించదు. ఇలాంటి సందర్భాలలో ఆహారం సమయానికి ఉడకదు. గ్యాస్ వృధా అవుతుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కొత్త రబ్బరు కొనడానికి ముందు కొన్ని గృహ నివారణ చిట్కాలను ప్రయత్నించండి. కుక్కర్ రబ్బరు నిరంతరం వేడికి గురికావడం వల్ల క్రమంగా దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. అలాగే ఆహార పదార్ధాలు, నూనె పేరుకుపోవడం వల్ల కూడా రబ్బరు మూత వదులుగా మారుతుది. ఫలితంగా అది సాగుతుంది. సంకోచించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే..

ఐస్ వాటర్ అత్యంత వేగవంతమైన, నమ్మదగిన పరిష్కారం. ఇందుకోసం ముందుగా కుక్కర్ మూత నుంచి రబ్బరు తొలగించాలి. దానిపై ఉన్న జిగట తొలగిపోయేలా సబ్బుతో కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ తీసుకోవాలి. రబ్బరును పూర్తిగా నీటిలో ముంచి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. చల్లదనం వల్ల రబ్బరు కుంచించుకుపోతుంది. ఇది రబ్బరు దాని అసలు ఆకృతికి తిరిగి రావడానికి సహాయపడుతుంది.

మీరు కుక్కర్‌ను వెంటనే ఉపయోగించకూడదనుకుంటే రబ్బరును కడిగి ఆరబెట్టి, ఫ్రీజర్‌లో 10-20 నిమిషాలు ఉంచాలి. ఇది రబ్బరు గట్టిపడటానికి, మూతపై గట్టిగా ఫిక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. అయితే రబ్బరు చాలా పాతదైతే, పైన పేర్కొన్న చిట్కాలు పని చేయవు. ఇలాంటి సందర్భంలో ఆవిరి బయటకు పోకుండా మూత అంచులకు తడి పిండిని పొర మాదిరి పూయాలి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నిర్వహిస్తుంది. అయితే ఈ చిట్కాలు ఉపయోగించిన తర్వాత రబ్బరును తీసివేసి శుభ్రం చేయాలి. లేదంటే దానిపై ఆహార కణాలు పేరుకుపోయి త్వరగా పాడైపోతుంది. రబ్బరు స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి, అప్పుడప్పుడు కొద్దిగా వంట నూనె కుక్కర్ రబ్బరుకు పూయాలి. అధిక వేడి కారణంగా అది త్వరగా వదులుగా మారుతుంది కాబట్టి, రబ్బరును ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు.

ఇవి కూడా చదవండి

అయితే రబ్బరు పంక్చర్ అయినా లేదా తెగిపోయినా దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఇలాంటి సందర్భాలలో భద్రతా కారణాల దృష్ట్యా కొత్త రబ్బరు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.