గర్భధారణ సమయంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి అన్ని పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ బొప్పాయి పండు విషయంలో చాలా మంది తటపటాయిస్తూ ఉంటారు
TV9 Telugu
బొప్పాయి పండు రుచికి తియ్యగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
కానీ బొప్పాయి పండు విషయంలో ముఖ్యంగా పచ్చి బొప్పాయి విషయంలో అనేక అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. బొప్పాయి పండు గర్బిణీలకు హాని కలిగిస్తుందని, అందుకే గర్భధారణ సమయంలో అస్సలు తీసుకోకూడదని అంటుంటారు
TV9 Telugu
నిజానికి.. గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. జీర్ణక్రియ మందగించడం, ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న గర్భిణీలు బొప్పాయి పండును కొద్ది మోతాదులో తీసుకోవచ్చు
TV9 Telugu
మస్య పండులో కాదని బొప్పాయి పండు ఎంత వరకు పండింది, దానిని ఎంత మోతాదులో తీసుకుంటున్నామనే దానిపై గర్భిణీల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో ఉండే హానికారక మూలాలను తొలగించే కెరోటినాయిడ్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
గర్భధారణ సమయంలో స్త్రీలు ఎక్కువగా మలబద్దకం సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు బొప్పాయి పండును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది
TV9 Telugu
బొప్పాయిలోని ఫోలేట్ పిండం మెదడు, వెన్నునిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే గర్భస్రావం, ముందస్తు ప్రసవం, లాటెక్స్ అలెర్జీలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడమే మంచిది. సాధారణ గర్భిణీలు బాగా పండిన బొప్పాయిని కప్పు మోతాదులో వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు