Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dental Care: పంటినొప్పితో బాధపడుతున్నారా.. పిప్పి పన్ను వేధిస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో అన్ని సమస్యలకు చెక్ పెట్టండి..

పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. సమస్య పెద్దది అయ్యే వరకు మనలో చాలామంది మన నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు.

Dental Care: పంటినొప్పితో బాధపడుతున్నారా.. పిప్పి పన్ను వేధిస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో అన్ని సమస్యలకు చెక్ పెట్టండి..
Dental Care
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 19, 2021 | 12:42 PM

పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. సమస్య పెద్దది అయ్యే వరకు మనలో చాలామంది మన నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించరు. బిజీగా ఉండే జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మనం తినే తినే ఫుడ్డు కూడా ఇందుకు కారణంగా మారే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రం చేయకపోవడంతో ఇలాంటి సమస్య వస్తుంది. రాత్రి సమయంలో బ్రష్ చేయకపోవడం. దీని కారణంగా దంతాలలో పురుగులు చేరుతాయి. ఈ సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నూనే..

కొబ్బరి నూనెను దంత కావిటీస్ వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఒక చెంచా స్వచ్ఛమైన కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను తీసుకోండి. ఈ నూనెను పుక్కిట పట్టండి. ఈ నూనెను సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు (గార్లింగ్) పుక్కిలించండి. ఆ తరువాత ఉమ్మేయండి.

లిక్కర్ రూట్..

లైకోరైస్ రూట్ సమస్యను తగ్గించడానికి ఇది అద్భతమైన పరిష్కారం అని చెప్పవచ్చు. దీని కోసం లిక్కరిస్ ముక్క తీసుకొని పౌడర్ చేయండి. బ్రష్‌లో ఈ పొడిని అప్లై చేయడం ద్వారా దంతాలను శుభ్రం చేసి.. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.

వేప డాటూన్ (వేప పుళ్ళ)..

మీరు దంతాలను శుభ్రం చేయడానికి వేప పుళ్ళను కూడా ఉపయోగించవచ్చు. దంతాలు శుభ్రంగా ఉంచుకునేందుకు వేప సహాయపడుతుంది. మీరు ఈ వేప పుళ్లను బ్రష్‌గా కూడా ఉపయోగించవచ్చు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వేప కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకుంటారు.

లవంగ నూనె..

లవంగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగ నూనె 2-3 చుక్కలను పత్తిని ఉపయోగించి జోడించండి. మీరు రాత్రికి లవంగ నూనెను అప్లై చేయవచ్చు. ఇది కాకుండా లవంగం నూనెలో కాటన్ వేసి పిప్పి పన్ను మీద ఉంచండి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా చేయడం ద్వారా సమస్య త్వరగా నయమవుతుంది.

వెల్లుల్లి..

పిప్పి పన్ను సమస్యను తొలగించడానికి వెల్లుల్లి నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు 7 నుండి 8 మొగ్గలు వెల్లుల్లిని మెత్తగా చేసి, పిప్పి పన్ను ఉన్న చోట అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి. ఆ తర్వాత కడిగేయాలి.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..