Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేదా? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయ్? మృగాళ్లు విచ్చలవిడిగా...
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేదా? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయ్? మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి కారణమేంటి? కఠిన శిక్షలు లేకపోవడమా… లేక త్వరగా శిక్షలు పడకపోవడమా? మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతోన్న పోకిరీల్లో భయం ఎందుకు ఉండటం లేదు? అసలు లోపం ఎక్కడ ఉంది? తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న వరుస ఘటనలు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి.
హైదరాబాద్ లో మరో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆటో ఎక్కిన యువతిని ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు మృగాళ్లు. పట్టపగలు జరిగిన ఈ దారుణం హైదరాబాద్ లో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. దగ్గరి దారంటూ ఆటోను దారి మళ్లించిన ఆటో డ్రైవర్… తన స్నేహితుడితో కలిసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు. సాయంత్రం తర్వాత కోలుకున్న బాధితురాలు ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, బాధితురాలు ఇంకా షాక్ లోనే ఉండటంతో వివరాలు సరిగా చెప్పలేకపోతోందని పోలీసులు అంటున్నారు.
యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని మార్గాల్లో ఆధారాల కోసం వెతుకుతున్నారు. ప్రధాన రహదారి, లింక్ రోడ్స్ తోపాటు నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
ఆటో ఏ మార్గంలో వెళ్లింది? నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అలాగే, సంతోష్ నగర్ నుంచి మైలార్ దేవ్ పల్లి, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నళ్లను విశ్లేషిస్తున్నారు. ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు.
సంతోష్ నగర్ లో ఉంటూ మైలార్ దేవ్ పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న యువతి… బుధవారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఆటో ఎక్కింది. ఆటోను దారి మళ్లించిన డ్రైవర్… ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఇక్కడ కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయ్. యువతి… సంతోష్ నగర్ లో ఆటో ఎక్కింది.
మైలార్ దేవ్ పల్లి వెళ్లాలి. పహాడీ షరీఫ్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. అయితే, ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తుంటే యువతి ఏం చేస్తోంది? ఒంటరిగా ఆటో ఎక్కినప్పుడు అలర్ట్ గా ఎందుకు ఉండలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.
ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నట్లు? మహిళలు బీ కేర్ ఫుల్. ఎందుకంటే మీ పక్కనే ఈ ఇలాంటి మృగాళ్లు ఉంటారు. అలర్ట్ లేకపోయారో అంతే సంగతులు. ఆదమరిచారో కాటేసి వెళ్లిపోతారు. సో… బీ అలర్ట్ లేడీస్.
ఇవి కూడా చదవండి: Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..
AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు