గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు

AP Crime News: అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. మాయ మాటలకు నమ్మి సర్వం పోగొట్టుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు
Tenali Crime
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 19, 2021 | 6:49 AM

AP Crime News: అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. మాయ మాటలకు నమ్మి సర్వం పోగొట్టుకుంటున్నారు. బ్యాంకులు, బాగా రద్దీగా ఉండే ప్రదేశాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఎవరో ఒకరి చేతిలో మోసపోక తప్పదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మనల్ని బురిడీ కొట్టించి సర్వం మాయం చేస్తారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇదే జరిగింది. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఓ అమాయక మహిళ నుంచి లక్షరూపాయలు కాజేశాడు ఓ దుండగుడు.

తెనాలి పట్టణానికి చెందిన ఓ మహిళ బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐకి వెళ్లింది. అక్కడ ఆమెకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. మెల్లగా మాటలు కలిపి తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని నమ్మించాడు. నగదును తాను డిపాజిట్‌ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయలతో ఉడాయించాడు. ఖాతాలో నగదు డిపాజిట్ కాకపోవడంతో ఆందోళన చెందిన మహిళ బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిసింది. వారు నగదు జమ కాలేదని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించింది. అప్పటికి కానీ ఆమెకు పూర్తి విషయం అర్థం కాలేదు.

వెంటనే తేరుకున్న మహిళ బ్యాంకు అధికారుల సూచన మేరకు సీసీ పుటేజీని పరిశీలించి నగరంలోని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు సీసీ కెమెరాలను పరిశీలించి దొంగ కోసం గాలిస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకుల వద్ద కాపు కాస్తారు. అనుమానంగా ఎవరు కనపడినా సమాచారం అందించాలని పోలీసులు బ్యాంకు అధికారులకు సూచించారు.

Minister Peddireddy: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు మరో ఎంపీ, ఎమ్మెల్యే

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్.. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?