Inspiring Story: మానవతా మూర్తి సుధామూర్తి పుట్టిన రోజు నేడు.. ఆమెలోని సహాయం చేసే గుణం గురించి తెలిపే కథ

Inspiring Story: మానవతా మూర్తి సుధామూర్తి పుట్టిన రోజు నేడు.. ఆమెలోని సహాయం చేసే గుణం గురించి తెలిపే కథ
Sudha Murthy

Inspiring Story: ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు. బతకడం వేరు, జీవించడం వేరు. చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు. అలాంటివారి మనకు జీవితంలో..

Surya Kala

|

Aug 19, 2021 | 7:41 AM

Inspiring Story: ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు. బతకడం వేరు, జీవించడం వేరు. చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు. అలాంటివారి మనకు జీవితంలో అతి తక్కువమంది కనిపిస్తున్నారు. వారిలో ఒకరు సుధామూర్తి.. ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్న పద్మశ్రీ సుధా మూర్తి పుట్టిన రోజు నేడు.

1950 ఆగస్టు 19 న కర్ణాటకలోని హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మ ల మధ్య గడిచింది. టాటా వారి టెల్కోలో భారతదేశం మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా సుధామూర్తి ప్రవేశించినా.. 2,21,501 మంది ఉద్యోగులతో ఏటా 2.48 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయం కలిగిన ఇన్ఫోసిస్ నడిపే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు చైర్మన్ అయినా, సుధా మూర్తి సింపిల్ సిటీకి మారుపేరులా వుంటారు

సుధామూర్తి మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. ఇప్పటికే పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. తన వృత్తి జీవితంతో బాటు సుధామూర్తి ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తారు. రచించిన కన్నడ నవల డాలర్ సొసే ఇంగ్లీషు లో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది. ఇంతటి మంచి వ్యక్తిత్వం కలిగిన సుధా మూర్తి తనకు ఎవరైనా ఆపదలో కనిపిస్తే వెంటనే ఆడుకుంటారు. ఈ విషయాన్నీ నిరూపిస్తూ.. ఒక సంఘటన గురించి ప్రముఖ పత్రికలో కథగా ప్రచురించారు.

బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ళమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను ఆనాల్సిన నాలుగు మాటలూ అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ. ఆ మాటలకు బిక్క మొహం వేసుకుందా పిల్ల. అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి ఇది చూశారు. వెంటనే టీసీతో “అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు నేనిస్తాను అని సుధామూర్తి చెప్పారు. దీంతో టీసీ “వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టిక్కెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు” అని చెప్పారు. అయినా సుధామూర్తి టీసీ మాటలను పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసిచ్చారు. తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి ఆడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని.. వివరాలు అడిగారు.

ఆ అమ్మాయి తాను ఇట్లోంచి పారిపోయి వచ్చిన విషయం చెప్పింది. తన తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతితల్లి నానా మాటలు అనడం, కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది. లక్ష్యం లేని దారీ తెన్నూ తెలియని జీవన ప్రయాణం ఆమెది. సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నాది. బెంగుళూరూ స్టేషన్లో రైలు ఆగింది.

ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమెకోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయికోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల. సుధామూర్తి దగ్గరకెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు. దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారు వెళ్ళింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి. ఆ తర్వాత సుధామూర్తి మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.

ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు. అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్ళే ఆ అమ్మాయిని అమెరికా పంపించారు. ఈ కాలం గిర్రున తిరిగింది. ఓ సారి అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సుధామూర్తి ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసారు. అంతేకాదు ఆఖరిరోజు సుధామూర్తి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్ళారు. అయితే కౌంటర్లోని వారు “వద్దండి. మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టాశారండి” అన్నారు.

“ఎవరా అమ్మాయి? చెప్పగలరా? ” అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు. “మీరెందుకమ్మా నా ఖర్చుకి పే చేశారు” అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర్నించి ఇప్పుడు బిల్లు పే చెయ్యడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది. “మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది….మీ బిల్లు నేను పే చెయ్యడం చాలా చిన్నది. నావల్ల అయిందిదే” అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దణ్ణం పెడుతుంది. ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్ళు కారాయి. నిజంగానే జరిగిన సంఘటన 5-6 సంవత్సరాల క్రితం రామకృష్ణ మఠం వారు రామకృష్ణప్రభ పుస్తకంలో ప్రచురించారు.

అందుకే సహాయం చెయ్యాలి.. ఒక వేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా ఖర్మ అనుభవిస్తారు.. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.

Also Read: Ramayana: హనుమంతుడికి శత్రువులో కూడా శతృత్వాన్ని ఎంతవరకూ చూడాలో సీతాదేవి చెప్పిన నీతి కథ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu