Salt Good or Bad: అధిక ఉప్పుతో ఆరోగ్యానికి ముప్పా.. ఎంత మోతాదులో తినాలంటే
Salt Good or Bad: ఉప్పు షడ్రుచుల్లో ఒకటి. భారతీయుల వంటకాల్లో ప్రధాన పాత్రను వహిస్తుంది ఉప్పు. రుచికోసమే కాదు.. ఆహారాన్నినిల్వ చేసుకోవడానికి కూడా ఉప్పుని ఉపయోగిస్తారు. రోజూ వండుకునే..
Salt Good or Bad: ఉప్పు షడ్రుచుల్లో ఒకటి. భారతీయుల వంటకాల్లో ప్రధాన పాత్రను వహిస్తుంది ఉప్పు. రుచికోసమే కాదు.. ఆహారాన్నినిల్వ చేసుకోవడానికి కూడా ఉప్పుని ఉపయోగిస్తారు. రోజూ వండుకునే ఆహార పదార్ధాలకు రుచికోసం ఉప్పుని వాడితే.. ఆవకాయ వంటి పచ్చళ్ళను, చేపలను ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. అయితే రోజు రోజుకీ మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. అయితే కొంతమంది ఉప్పుని ఎక్కువగా తింటారు.. మరికొందరు అసలు ఉప్పుని అసలు వేసుకోరు.. దీంతో ఈ ఉప్పుని తీసుకునే విధానంపై కొంతమంది పరిశోధకులు పరిశోధనలు చేశారు. పరిశోధన ఫలితాలు గురించి వివరాల్లోకి వెళ్తే..
అధికంగా తినే ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని.. ఎక్కువగా ఉప్పు తింటే, మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వ్యాధుల బారిన పడతారని తెలిపారు. ఎలుకలపై ప్రయోగం చేయగా ఎక్కువగా ఉప్పుతీసుకున్న ఎలుకలు పిచ్చిగా ప్రవర్తించాయని, సరిపడ ఉప్పు తిన్న ఎలుకలు మాత్రం మాములుగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. అందుకనే ఉప్పుని మోతాదుకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
ఉప్పుని భూ వాతావరణంలో చల్లితే.. వాతావరణాన్ని చల్లబరుస్తుంది. భూతాపాన్ని తగ్గిస్తుంది. అయితే ఇదే ఉప్పు భూమిపై ఉన్న ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్‌లను నాశనం చేస్తుంది కనుక భూమిపై వేడిని తగ్గించేందుకు ఉప్పును చల్లడం మంచిది కాదని తెలిపారు.
అయితే ఎప్పుడైనా కుక్క కరిస్తే.. గాయాన్ని ఉప్పు నీటితో శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనలో తేలింది. ఉప్పు అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వేసవిలో మీ శరీరం తేమగా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ నుండి ఉప్పును పూర్తిగా నివారిచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకని ఉప్పుని తగిన మోతాదులో తీసుకోవడం వలన శరీరంలోని బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇది శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.
Also Read: మనవరాలితో ప్రకృతిని, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న మాజీ మంత్రి.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..