Asthma Care In Monsoon: ఆస్తమా రోగులు వర్షాకాలంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు.. నిపుణుల సూచనలు..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటారు. ముఖ్యంగా జ్వరం, జలుబు, ఫ్లూ, ఫంగస్, దగ్గు, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటారు. ముఖ్యంగా జ్వరం, జలుబు, ఫ్లూ, ఫంగస్, దగ్గు, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సీజన్లో తేమ, బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అయితే వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో దాదాపు 20 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని.. అందులో ప్రతి పది మందిలో ఒకరు భారతీయుడు ఉన్నారు. ఈక్రమంలో వర్షాకాలంలో ఆస్తమా రోగులు గుర్చుంచుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకుందామా.
ఈ సీజన్లో సాధ్యమానంతవరకు దుమ్ము ఉండే వస్తువులకు, పరిసరాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటికి వెంటిలేషన్ చేయాలి. ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ వ్యవస్థ ఉండాలి. ఆస్తమా రోగులు తమ ఇన్హేలర్ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
వర్షాకాలంలో ఆస్తమా ఎందుకు పెరుగుతాయి. వర్షాకాలంలో ఇండోర్ తేమ చాలా పెరుగుతుంది. అలాగే దుమ్ము కూడా పెరుగుతుంది. అయితే ఆస్తమా రోగులకు ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఈ సీజన్లో వచ్చే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులు ఆస్తమా రోగులకు మరింత ప్రమాదం.
ఏం గుర్తించుకోవాలి. వర్షాకాలంలో ఆస్తమా రోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ.. వైద్యులకు అందుబాటులో ఉండాలి. డాక్టర్స్ సూచనల ప్రకారం సప్లిమెంట్స్, ఇన్హేలర్ తీసుకోవాలి. ఆస్తమమాలో ఉపయోగించే పొడి పొడి ఇన్హేలర్లు సులభంగా కలుషితమవుతాయని వైద్యులు అంటున్నారు. అవి జుట్టు, చుండ్రు ట్రిగ్గర్‌గా పనిచేస్తాయి. వీరికి శ్వాస సమస్యలు అధికమవుతాయి. అలాగే పెంపుడు జంతువులు ఇంట్లోనే ఉండాలి. అవి బయట తిరగడం వలన అలెర్జీ కణాలు ఎక్కువగా వ్యాపిస్తాయి.
జాగ్రత్తలు.. 1. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో ధూళి కణాలు ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆస్తమా రోగులు ధుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండకూడదు. 2. ఇంటిని శుభ్రపరచడానికి ఫినైల్ లేదా లైసోల్ మొదలైనవి ఉపయోగిస్తుంటే, వాటి వాసన కూడా ఆస్తమా రోగులకు ట్రిగ్గర్‌గా పనిచేస్తుందియ 3. వీలైనంత వరకు చల్లని పానీయాలు, ఐస్ క్రీం, చల్లని పదార్థాలను తినడం మానుకోవాలి. అలాగే AC లేదా ఫ్యాన్‌లో పడుకుంటే గదిని ఎక్కువగా చల్లబరచకపోవడం మంచిది.
Also Read: Savithri w/o Sathyamurthi : సావిత్రి w/o సత్యమూర్తి టీజర్ రివ్వ్యూ.. నవ్వులే నవ్వులు ఇక..