AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits Eat: భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం సరైనదేనా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Fruits Eat: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తిసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు వైద్య..

Fruits Eat: భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం సరైనదేనా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Subhash Goud
|

Updated on: Aug 20, 2021 | 10:52 AM

Share

Fruits Eat: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తిసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజు పండ్లను తిసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదే విధంగా తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదేనా.? కాదా అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తుతుంటాయి. వైద్య నిపుణుల నివేదికల ప్రకారం.. ఆహారం తీసుకున్న తర్వాత పండ్లు తీసుకోవడం శరీరానికి మంచిది కాదని అనేక నివేదికలు చెబుతున్నాయి. మీరు తిన్న తర్వాత పండ్లు తింటే మీ శరీరానికి హాని కాకపోయినా.. సరైన పోషకాలు అందవని వైద్యులు సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం మరింత ప్రయోజనం కలుగుతుంది. కానీ.. కడుపు నిండిన తర్వాత పండ్లను తీసుకుంటే పండ్లును జీర్ణం చేసుకోవడంలో కడుపు ఇబ్బంది పడుతుంది. దీని వల్ల పండ్ల ద్వారా శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందలేవు. అందు వల్ల ఆహారం తిన్న చాలా సమయం తర్వాత పండ్లను తినడం మంచిదంటున్నారు. అయితే చాలా మంది డైటీషియన్లు కూడా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత పండ్లు తినవచ్చని చెబుతుంటారు. చాలా పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉన్నందున జీర్ణక్రియలో సహాయపడుతుందని చెబుతుంటారు. కొన్ని పండ్లు సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కావు.

ఆహారం తిన్న తర్వాత పండ్లు తినాలనుకుంటే ఆహారం తిన్న వెంటనే తీసుకోకూడదు. భోజనం చేసిన కొత సమయం తర్వాత పండ్లను తీసుకోవడం మేలు. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత పండ్లను తింటే అవి సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. అప్పుడు శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి.

రోగ నిరోధకశక్తికి పండ్లు కీలకం కావడంతో అందరూ వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పెద్దగా ఆసక్తి చూపని వారు సైతం పండ్లు తింటున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బత్తాయి, నారింజ, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ, ద్రాక్ష, ఆపిల్‌ తదితర పండ్లలో ‘సీ’ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. పండ్లు(Fruits) తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ.. ఏ పండుతో ఎటువంటి పోషకాహారాలు లభిస్తాయి ? ఏ పండుతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మాత్రం కొందరికే తెలుసు. అసలే రకరకాల రోగాలు, ఇన్‌ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనావైరస్‌ సోకున్న సమయంలో పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోవడం బెటర్‌. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడే శక్తి పండ్ల సొంతం. అంతేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటివాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు వైద్యులు కూడా పండ్లను ఎక్కువగా తీసుకోవాలని పదేపదే సూచిస్తుంటారు.

ఇవీ కూడా చదవండి: Dental Care: పంటినొప్పితో బాధపడుతున్నారా.. పిప్పి పన్ను వేధిస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాతో అన్ని సమస్యలకు చెక్ పెట్టండి..

Crying Benefits: ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..? శిశువు మొట్టమొదటి ఏడుపు ఎంత ముఖ్యమంటే..

Milk Teeth: పిల్లలు తమ పాల దంతాలను ఎందుకు కోల్పోతారు.. దీని వెనుక అసలైన కారణం ఇదే..!