Raja Raja Chora Review: ఇంతకీ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ప్రేక్షకుల మనసులు కొల్లగొడతాడా?

Raja Raja Chora Review: కొన్ని కేరక్టర్స్ ని చాలా ఈజ్‌తో చేస్తారు శ్రీవిష్ణు. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా భాస్కర్‌ కేరక్టర్‌ కూడా అలాంటిదే. సాఫ్ట్ వేర్‌ కమ్‌ సేల్స్ గర్ల్ గా సంజన పెర్ఫార్మెన్స్ నేచురల్‌గా ఉంది.

Raja Raja Chora Review: ఇంతకీ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ప్రేక్షకుల మనసులు కొల్లగొడతాడా?
Raja Raja Chora Movie Review
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 19, 2021 | 12:46 PM

Raja Raja Chora Movie Review:మలయాళంలోనూ, మరాఠీలోనూ వచ్చే డిఫరెంట్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చాలా బావున్నాయంటూ మనం ఎప్పుడూ అప్రిషియేట్‌ చేస్తుంటామే… అలాంటి కథలను ఏరికోరి సెలక్ట్ చేసుకుని సినిమాలు చేసే హీరోలు మన దగ్గర కూడా కొందరున్నారు. ఆ లిస్టులో కచ్చితంగా కనిపించే పేరు శ్రీవిష్ణు. కొందరి మాట మీద మనకు ఓ గురి ఉంటుంది. అలాగే కొందరి సెలక్షన్‌ మీద కూడా. శ్రీవిష్ణు సెలక్షన్‌ మీద చాలా మందికే గురి ఉంటుంది. ఏదో డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటాడని చాలా మంది నమ్మకం. మరి ఈ సారి కోటూ సూటుకు బదులు కిరీటం పెట్టుకుని రాజరాజచోరగా కనిపించిన శ్రీవిష్ణు సెలక్షన్‌ ఎలా ఉంది? ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుందా? చదివేద్దాం…

సినిమా: రాజరాజచోర నటీనటులు: శ్రీవిష్ణు, సునైనా, మేఘా ఆకాష్‌, అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌ తదితరులు రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి ప్రొడ్యూసర్స్‌: టీజి విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే

భాస్కర్‌ ( శ్రీవిష్ణు) ఓ జిరాక్స్ షాప్‌లో పనిచేస్తుంటాడు. అతనికి భార్య విద్య (సునైన), ఓ కొడుకు ఉంటారు. విద్య లా చదువుతుంటుంది. జిరాక్స్ షాప్‌లో చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండటంతో అప్పుడప్పుడూ దొంగతనాలు చేస్తుంటాడు. అంతే కాదు, తాను సాఫ్ట్ వేర్‌ ఉద్యోగిని అని చెప్పి సంజన (మేఘా ఆకాష్‌)తో లవ్‌స్టోరీ నడుపుతుంటాడు. సంజన సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేస్తున్నానని చెబుతుంది. భాస్కర్‌కీ విద్యకీ మధ్య మాటలు కూడా ఉండవు. మధ్య తరగతి గొడవలు ఆ ఇంట్లో ఎప్పుడూ కనిపిస్తుంటాయి. ఇటు సంజన మాత్రం భాస్కర్‌తో కలిసి మంచి ఇల్లు కట్టుకుని సెటిల్‌ అవ్వాలని అనుకుంటుంది. దొంగతనాలకి వెళ్లడానికి ముందు, సంజన దగ్గరకు సాఫ్ట్ వేర్‌ ఎంప్లాయిగా నిలుచోవడానికి ముందు… డ్రస్‌ చేంజింగ్‌కి అంజమ్మ (గంగవ్వ) కార్ల షెడ్ ని వాడుకుంటుంటాడు భాస్కర్‌. ఈ క్రమంలో అతనికి పోలీస్‌ విలియమ్‌ రెడ్డి (అల్లరి రవిబాబు) తగులుతాడు. విలియమ్‌కి మాధవ్‌ అనే ఫ్రెండ్‌ ఉంటాడు. అతను తరచూ ట్రిప్పుల కోసం బయటూళ్లకు వెళ్తుంటాడు. ఓ సారి దొంగతనానికి వెళ్లిన భాస్కర్‌కి, ఒక ఇంటి ముందు మాధవ్‌, ఇంటిలోపల నుంచి బయటికొస్తూ విలియమ్‌ కనిపిస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? సినిమాలో సెకండాఫ్‌కి లీడ్‌ చేసే విషయం అదే. అప్పటిదాకా భాస్కర్‌ మీద అనుమానపు చూపున్న విలియమ్‌ ఆ తర్వాత భాస్కర్‌తో ఎందుకు చేతులు కలిపాడు. విద్య, సంజన మధ్య భాస్కర్‌ నలిగిపోయాడా? ఎవరికి చేరువయ్యాడు? మధ్యలో అంజమ్మ కథ ఏంటి? రాజు దొంగ అని పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు? వంటివన్నీ ఇంట్రస్టింగ్‌ పాయింట్స్.

కొన్ని కేరక్టర్స్ ని చాలా ఈజ్‌తో చేస్తారు శ్రీవిష్ణు. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా భాస్కర్‌ కేరక్టర్‌ కూడా అలాంటిదే. సాఫ్ట్ వేర్‌ కమ్‌ సేల్స్ గర్ల్ గా సంజన పెర్ఫార్మెన్స్ నేచురల్‌గా ఉంది. భర్త మీద కోపంతో రగిలిపోయే మిడిల్‌ క్లాస్‌ భార్య కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ సునయన. రియల్‌ ఎస్టేట్‌ మీద మోజుపెంచుకున్న డాక్టర్‌ కేరక్టర్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చక్కగా ఒదిగిపోయారు. సినిమా స్టార్టింగ్‌ నుంచి డ్రైవింగ్‌ ఫోర్స్ ప్రవచన కర్తగా తనికెళ్ల భరణి చేసిన ప్రసంగం. టేకాఫ్‌, ఇంటర్వెల్‌, ల్యాండింగ్‌ అంతా పర్ఫెక్ట్ గా ఆయన కేరక్టర్‌ ద్వారా జరుగుతుంది. అల్లరి రవిబాబు విలియమ్‌ కేరక్టర్‌కి ప్లస్‌ అయ్యారు. జెరాక్స్ షాప్‌ ఓనర్‌గా అజయ్‌ ఘోష్‌ క్యారక్టర్‌ కన్విన్సింగ్‌గా ఉంది. సినిమా స్టార్టింగ్‌లో గంగవ్వ కేరక్టర్‌ని ఊరికే పెట్టారులే అనిపిస్తుంది కానీ, సినిమా ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఆ కేరక్టర్‌కి ఓ పర్పస్‌ పెట్టి ఫిదా చేశారు డైరక్టర్‌.

Raja Raja Chora Movie Review

Raja Raja Chora Movie

అతి తక్కువ పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ, ఆశలు, ఆకాంక్షలు… ఇలాంటి అంశాల చుట్టూ అల్లుకున్న కథనం కూడా బావుంది. అక్కడక్కడా స్లో నెరేషన్‌ కాస్త బోర్‌ కలిగించినా, ఓవరాల్‌గా సినిమాలో పది నిమిషాలకో ట్విస్టు, ఫీల్‌ గుడ్‌ ఎలిమెంట్స్ కన్విన్సింగ్‌గా ఉన్నాయి. విషయం నలుగురిలోకి వచ్చాక ఏ భార్యయినా, భర్తనే సపోర్ట్ చేస్తుంది సార్‌ అని విద్య చెప్ప డైలాగ్‌, పెద్దది ఉన్నట్టు చిన్నదానికి చెప్పు చాలు అని గంగవ్వ చెప్పే మాట, భార్యాభర్తల గురించి భాస్కర్‌ చెప్పే డైలాగులు ఆయా సీన్స్ కి హైలైట్స్.

సెకండాఫ్‌లో విద్య కేరక్టర్‌ జెర్సీలో నాని వైఫ్‌ శ్రద్ధశ్రీనాథ్‌ని, మజిలీలో సమంతను గుర్తుచేస్తుంది. లుంగీ కట్టుకుని శ్రీవిష్ణు కనిపించే సన్నివేశాల్లో ఒకట్రెండు చోట్ల వరల్డ్ ఫేమస్‌ లవర్‌లో విజయ్‌ దేవరకొండ చేసిన శీనయ్య కేరక్టర్‌ని గుర్తుచేస్తుంది.

వివేక్‌సాగర్‌ మ్యూజిక్‌ ట్రెండీగా ఉండటమే కాదు, కథతో పాటు జెల్‌ అయి సాగుతుంది. టైటిల్స్ ని వీలైనంత వరకు తెలుగులోనే వేయాలనే డైరక్టర్‌ ప్రయత్నం కూడా బావుంది. సినిమా రిలీజ్‌కి ముందే శ్రీవిష్ణు చెప్పినట్టు… ఇతర భాషల్లోనూ రీమేక్‌ని అవకాశం ఉన్న సబ్జెక్ట్. మిడిల్‌ క్లాస్‌ మనస్తత్వాలు, గోల్స్, కాన్‌ఫ్లిక్స్ట్ వంటివి యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న విషయాలు. సో ఏ లాంగ్వేజ్‌ వాళ్లకైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.

– డా. చల్లా భాగ్యలక్ష్మి, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..  డిఫరెంట్ లుక్‏లో సుధీర్.. 

మనవరాలితో ప్రకృతిని, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న మాజీ మంత్రి.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..