Vani Kapoor: ఆర్థిక కష్టాల్లో హీరోయిన్.. జీవితంలో అనేక సమస్యలతో బాధ్యతలు మోస్తున్నా అంటూ..

ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది వాణీ కపూర్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‏గా నిలిచింది.

Vani Kapoor: ఆర్థిక కష్టాల్లో హీరోయిన్.. జీవితంలో అనేక సమస్యలతో బాధ్యతలు మోస్తున్నా అంటూ..
Vani Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2021 | 11:49 AM

ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది వాణీ కపూర్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‏గా నిలిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వత బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‏లో వరుస ఆఫర్లను ఫుల్ బిజీగా గడిపేస్తుంది. శుధ్ దేశీ రొమాన్స్ సినిమా ద్వారా నార్త్‏లోకి ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ బేఫిక్రే, వార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‏లో ఈ బ్యూటీ హవా నడుస్తోంది. అయితే వాణీ కపూర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.

కపూర్ కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైన వాణీకపూర్ కూడా ఆర్థిక కష్టాలను చవిచూసిందట. 18-19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోందట. ఆ సమయంలోనే కుటుంబానికి అండగా నిలబడాలనే నిర్ణయంతో కుటుంబ బాధ్యతలను తను తీసుకున్నట్లుగా ఇటీవల వాణీకపూర్ తెలిపింది. పరిస్థితులు మనిషిని ఎలాంటి స్థాయిలోకైనా నెట్టేస్తాయని.. కానీ వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితం ముందుకు సాగుతుందని.. ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని సంకల్పం ఉండాలని తెలిపింది. ఇక నటిగా ఎదిగే క్రమంలో తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. తానే స్వయంగా సమకూర్చుకున్నాని.. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న స్థాయిలోనూ గతంలో పడిన కష్టాలు.. భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లెందుకు ధైర్యాన్ని అందించాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బెల్ బాటమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే షామ్ శ్రీ చిత్రంలో నటిస్తోంది. ఇక వీటితోపాటు.. చాలా కాలం తర్వాత తెలుగులోకి ఈ అమ్మడు రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

ట్వీట్..

Also Read: sridevi soda center: ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్..  డిఫరెంట్ లుక్‏లో సుధీర్.. 

Savithri w/o Sathyamurthi : సావిత్రి w/o సత్యమూర్తి టీజర్ రివ్వ్యూ.. నవ్వులే నవ్వులు ఇక..

Ram Gopal Varma: అషురెడ్డి దగ్గర అగ్లీ క్రియేటివిటీ ప్రదర్శించిన ఆర్జీవి.. మండిపడుతున్న నెటిజన్స్..