AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BoycottSwaraBhasker:  ఆ నటిని అరెస్ట్ చేయాలి.. ట్విట్టర్‏లో ట్రెండ్ అవుతున్న బైకాట్ స్వర భాస్కర్.. కారణమేటంటే..

ఆఫ్ఘనిస్తాన్‏ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో వేలాది మంది ప్రజలు దేశం వదిలి పారిపోతున్నారు. ఇటీవల విమాన చక్రాలపై,

BoycottSwaraBhasker:  ఆ నటిని అరెస్ట్ చేయాలి.. ట్విట్టర్‏లో ట్రెండ్ అవుతున్న బైకాట్ స్వర భాస్కర్.. కారణమేటంటే..
Swara Bhaskar
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2021 | 7:46 AM

Share

ఆఫ్ఘనిస్తాన్‏ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో వేలాది మంది ప్రజలు దేశం వదిలి పారిపోతున్నారు. ఇటీవల విమాన చక్రాలపై, రెక్కలపై కూర్చోని ప్రయాణం చేస్తూ.. కిందపడి ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‏లో తాలిబన్లు అధికారికంగా పాలన చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్‏ను తాలిబన్లు చేసుకోవడంతో పలువురు ప్రముఖులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రహమాన్ బుర్కే తాలిబన్లను స్వాతంత్ర పోరాటంతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు స్వాధీనంపై చేసుకోవడంపై స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్‏లో #BoycottSwaraBhasker ట్రెండ్ అవుతుంది.

హిందూత్వ ఉగ్రవాదంతో మనం ఒకటి కాలేము. తాలిబన్ల ఉగ్రవాదంతో షాక్ అవుతాము అలాగే వినాశనానికి గురవుతాము. ఆపై #హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణిచివేత లేదా అణచివేతకు గురైనవారి గుర్తింపు పై ఆధారపడి ఉండకూడదు అంటూ ట్వీట్ ట్వీట్ చేసింది.

నాకు రీఫ్రేస్ చేయనివ్వండి. #తాలిబన్లు మనకు సూక్షబేధానికి అర్హుడు కాదు. అమెరికన్ సామ్రాజ్యవాదం అయినప్పటకీ ఇది తప్పు, దీనిని విమర్శించాలి. కానీ తాలిబన్లు స్వల్పభేదాన్ని పొందడానికి అర్హత లేదు. వారి అనేక తప్పులను గుర్తించాలి అంటూ మరో ట్వీట్ చేసింది. దీంతో తమ మనోభావాలను దెబ్బతీశారని.. హిందూత్వ ఉగ్రవాదం అంటూ మాట్లాడిందని.. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. #BoycottSwaraBhasker ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: Vishal: లైకా సంస్థకు భారీగా జరిమానా విధించిన హైకోర్టు.. ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్..