Vishal: లైకా సంస్థకు భారీగా జరిమానా విధించిన హైకోర్టు.. ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్..

తమిళ స్టార్ హీరో విశాల్ గత కొద్ది కాలంగా నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఉంటారు. వ్యక్తిగత విషయాల నుంచి సినిమా విషయాల

Vishal: లైకా సంస్థకు భారీగా జరిమానా విధించిన హైకోర్టు.. ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్..
Vishal
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2021 | 6:51 AM

తమిళ స్టార్ హీరో విశాల్ గత కొద్ది కాలంగా నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఉంటారు. వ్యక్తిగత విషయాల నుంచి సినిమా విషయాల వరకు ప్రతిదానిలో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కోర్టు విషయాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోలు ట్యాక్స్ చెల్లించే విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాకు మాద్రాసు హైకొర్టు షాకిచ్చింది.

విశాల్ హీరోగా నటించిన చక్ర సినిమాపై.. నిర్మాతలపై.. హీరోపై లైకా ప్రొడక్షన్ సంస్థ కాపీ రైట్స్ ఆరోపణలు చేస్తూ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టోరీని ఆ మూవీ డైరెక్టర్ ముందుగా తమకు వినిపించారని..తమతోనే నిర్మిస్తానని డైరెక్టర్ అన్నారని… కానీ చివరకు ఆ సినిమాను విశాల్ నిర్మించాడని లైకా సంస్థ ఆరోపించింది. ఎట్టకేలకు ఈ కేసు విచారణ చెపట్టింది హైకోర్టు. అయితే లైకా వేసిన కేసులు, ఆరోపణలు అన్ని తప్పుడుగా కనిపిస్తున్నాయని కేసును కొట్టి వేసింది. అంతేకాకుండా.. లైకాకు ఐదు లక్షల జరిమానా విధించింది.

దీనిపై హీరో విశాల్ స్పందిస్తూ.. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఎప్పుటికైనా నిజమే గెలుస్తుంది. కానీ ఈరోజు నిజమైంది. నాపై లైకా సంస్థ వేసిన కేసులు తప్పుడని న్యాయస్థానం నమ్మింది. అందుకే ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఇదంతా లైకా ప్రొడక్షన్స్ నన్ను మానసికంగా వేధించినందుకేనని అని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం విశాల్.. శరవణన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షుటింగ్ చివరిదశలో ఉంది.

ట్వీట్..

Also Read:  Lavanya Tripathi: కవ్వించే కళ్ళు.. ఆకర్శించే అందం ఉన్నా అవకాశాలు మాత్రం ఆమడ దూరంలోనే…

Suhas : పెళ్ళైన తర్వాతే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది.. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది

Hansika Motwani : సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్.. హన్సిక హీరోయిన్‌గా ఇంట్రస్టింగ్ కథతో రానున్న 105 మినిట్స్..