AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhas : పెళ్ళైన తర్వాతే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది.. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది

సుహాస్‌... `క‌ల‌ర్ ఫొటో` సినిమాతో హీరోగా స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు హీరోగా, న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్నారుఈ కుర్ర హీరో. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా,

Suhas : పెళ్ళైన తర్వాతే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది.. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది
Suhas
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2021 | 9:09 PM

Share

Suhas : సుహాస్‌… `క‌ల‌ర్ ఫొటో` సినిమాతో హీరోగా స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు హీరోగా, న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్నారుఈ కుర్ర హీరో. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరించారు సుహాస్. క‌ల‌ర్ ఫొటో సినిమాలో సుహాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సుహాస్. తాజాగా సుహాస్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. కలర్ ఫోటోతో హీరో అయ్యా. హీరోగా చేస్తూ… మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌గా చేస్తాను అన్నారు. ఇక ఇప్పుడు ఆరు సినిమాలు చేస్తున్నానని తెలిపారు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పుడు చేస్తున్న ఆరు సినిమాల్లో, ఐదింటిలో లీడ్ క్యారెక్ట‌ర్‌గా చేస్తున్నాను అన్నారు. అలాగే నేను షార్ట్ ఫిలింస్ చేస్తున్న‌ప్ప‌టి నుంచి నాతో ప‌రిచ‌యం ఉన్న ద‌ర్శ‌కుల‌తో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. హీరోగా చేసేట‌ప్పుడు చాలా భ‌యం ఉంటుంది. ప్రెష‌ర్ అయితే క‌చ్చితంగా ఉంటుందన్నారు.

ఈ బ‌ర్త్ డే(ఆగస్ట్ 19) నాకు చాలా స్పెష‌ల్‌ అన్నారు.  నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలోని వారంద‌రూ నా స్నేహితులు. ల‌క్కీగా నా చుట్టూ ఉన్న‌వాళ్లెవ‌రూ మార‌లేదు అని చెప్పుకొచ్చారు. ఇక  ఇండ‌స్ట్రీలో నాని అన్న‌, విజ‌యన్న‌, శివ‌న్న‌, నాగ‌చైత‌న్య‌గారు, స‌మంత‌గారు, బ్ర‌హ్మాజీగారు.. ఇలా అంద‌రూ స‌పోర్ట్ చేస్తున్నారు. అలాగే నా  త‌ల్లిదండ్రులు, భార్య‌, స్నేహితులు .. ఇప్పుడు కాస్త సెటిల్ అయ్యాన‌ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా భార్య నాకు బాగా క‌లిసొచ్చింది. త‌న‌ని పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింది అని ఎమోషనల్ అయ్యారు సుహాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Short Film Competitions: ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

Bandla Ganesh: ఆ విషయంలో బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. ఇక దబిడిదిబిడే అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..

Krish -Vaishnav Tej : ఎట్టకేలకు క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ అప్ డేట్ రానుంది.. ఎప్పుడంటే..