Short Film Competitions: ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ సర్కారు అమలు చేస్తోన్న ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్–2021 పోటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ
Short Film Competitions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ సర్కారు అమలు చేస్తోన్న ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్–2021 పోటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండాలని సదరు ప్రకటనలో సూచించారు. పోటీల్లో పాల్గొన దల్చిన వాళ్లు నవంబర్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్ కంటెంట్‌ను డీవీడీ/పెన్‌డ్రైవ్, బ్ల్యూరే ఫార్మాట్లలో డిసెంబర్ 31లోగా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివరాలకు www. apsftvtdc. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
Read also: Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో ఘోరాతి ఘోరం, బొలెరో వాహనంపైకి ఎక్కిన డంపర్