ఏపీలో ఉప్పొంగుతోన్న వాగులు, కొట్టుకుపోయిన వట్టిగెడ్డ కాజ్వే బ్రిడ్జి.. కట్టలేరుకు వరద ఉధృతి, తెగిన రాకపోకలు

ఏపీలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా అంతా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశా నుండి భారీగా వస్తున్న వరద నీరు,

ఏపీలో ఉప్పొంగుతోన్న వాగులు, కొట్టుకుపోయిన వట్టిగెడ్డ కాజ్వే బ్రిడ్జి.. కట్టలేరుకు వరద ఉధృతి, తెగిన రాకపోకలు
Vattigadda
Follow us

|

Updated on: Aug 18, 2021 | 3:33 PM

AP Rains – Floods: ఏపీలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా అంతా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశా నుండి భారీగా వస్తున్న వరద నీరు, నీటి ప్రవాహానికి పాచిపెంట మండలం మోసురు వద్ద వట్టిగెడ్డ కాజ్వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఇరు ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. వేరే మార్గం లేక పది గ్రామాల ప్రజల.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఇటు కృష్ణా జిల్లాలోని కట్టలేరుకు వరద ఉధృతి పొటెత్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తోంది కట్టలేరు. దీంతో వైరా, కట్టలేరు, వీరులపాడు, నందిగామ మండలాలకు రాకపోకలు నలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. తూర్పు, ఉత్తర కోస్తా, విశాఖ, గుంటూరు జిల్లాలో భారీగానే కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అటు, ఏపీలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తెలంగాణలో ముసురు కమ్మేసింది. తెలంగాణ వ్యాప్తంగా భారీస్థాయిలోనే వానలు పడుతున్నాయి. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఎడితెరిపి లేకుండా కురుస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గత రెండురోజులుగా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్స్ ఓపెన్ చేసి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతవరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమీక్షలు చేస్తున్నాయి.

Kattaleru

Kattaleru

Read also: హాట్ పాలిటిక్స్.. పరస్పర ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులు, లోకేష్ బయటకు వస్తున్నారంటే తడుపుకుంటున్నారన్న పిల్లి