హాట్ పాలిటిక్స్.. పరస్పర ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులు, లోకేష్ బయటకు వస్తున్నారంటే తడుపుకుంటున్నారన్న పిల్లి

గుంటూరులో రాజకీయం రంజుగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. లోకేష్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఫిర్యాదు చేయగా,

హాట్ పాలిటిక్స్.. పరస్పర ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదులు, లోకేష్ బయటకు వస్తున్నారంటే తడుపుకుంటున్నారన్న పిల్లి
Pilli Manikyalarao
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 18, 2021 | 3:05 PM

Guntur Politics: గుంటూరులో రాజకీయం రంజుగా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. లోకేష్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు.

ఈ అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఇవాళ గుంటూరు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో దళిత యువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపబడిందన్న ఆయన, విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన నారా లోకేష్, టీడీపీ నేతలను వైసీపీ రౌడీమూకలు ఎందుకు అడ్డుకున్నాయని నిలదీశారు.

నారా లోకేష్ మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడకుండా, డీఎస్పీ ఎందుకు తన కారులో తీసుకెళ్లారని మాణిక్యరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. లోకేష్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తడుపుకుంటున్నారన్నారని పిల్లి ఎద్దేవా చేశారు. లోకేష్‌ను ఆపడం వైసీపీ రౌడీమూకలు, పోలీసులు వల్లకాదన్నారాయన.

దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించిన పిల్లి మాణిక్యాలరావు, చీరాలలో కిరణ్ కుమార్‌ను కొట్టి చంపినప్పుడు, దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు నాగార్జున ఎక్కడ పడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా ఉంటే, చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారని వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఆట‌లు ఈ రాష్ట్రంలో చెల్లవ‌ని హెచ్చరించారు. టీడీపీ నేతలు యువతి మృతదేహాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. రమ్య హత్య ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారని మేరుగ పేర్కొన్నారు.

యువతి మృతదేహం ఉన్న వాహనాన్ని టీడీపీ జెండాలు వేసుకుని ఆపుతారా…? ఇది శవ రాజకీయం కాదా..? వచ్చిన లోకేష్ ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా…? అంటూ మేరుగ ప్రశ్నించారు.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్