Suspect Fire Accident: కర్నూలు జిల్లాలో వింత అగ్ని ప్రమాదం.. ఆ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..

Suspect Fire Accident: ఆ ఇళ్లలో ఉన్నట్లుండి మంటలు చెలరేగుతున్నాయి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, గంటకోసారి మంటలు అంటుకుంటూనే ఉన్నాయి.

Suspect Fire Accident: కర్నూలు జిల్లాలో వింత అగ్ని ప్రమాదం.. ఆ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..
Fire
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 18, 2021 | 5:26 PM

Suspect Fire Accident: ఆ ఇళ్లలో ఉన్నట్లుండి మంటలు చెలరేగుతున్నాయి. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, గంటకోసారి మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. కట్టుబట్టలు తప్ప.. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటికీ నిప్పులు రాజుకుంటున్నాయి. ఒక చోట మంటలు ఆర్పితే.. మరో చోట పుట్టుకొస్తున్నాయి. అది చూసి బాధిత వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వింత ప్రమాదం కర్నూలు జిల్లాలోని కోడుమూరు గ్రామంలో వెలుగు చూసింది. కోడుమూరు గ్రామానికి చెందిన బాధితుడు ఖాజావలీ కథనం ప్రకారం.. అతనికి మూడు ఇళ్లు ఉన్నాయి. ఈ మూడు ఇళ్లలో గంటకోసారి మంటలు చెలరేగుతున్నాయి. కట్టుకున్న బట్టలు తప్ప అన్ని బట్టలు, ధాన్యం మూటలు, వంట సామాగ్రి, ఇతర సామాగ్రి అన్నింటికీ మంటలు అంటుకుంటున్నాయి. ఒకచోట మంటలు ఆర్పితే.. మరోచోట మంటలు చెలరేగుతున్నాయి. ఇలాంటి గంటకోసారి ఒక్కొక్క చోట మంటలు చెలరేగుతుండటంతో.. బాధితుడు తీవ్ర భయాందోళనకు గురవుతూ.. వాపోతున్నాడు. ఈ వింత ఘటనను చూసేందుకు స్థానిక జనాలు బాధితుడికి ఇంటికి భారీగా వస్తున్నారు. కాగా, అధికారులు దీనిపై స్పందించాలని బాధిత వ్యక్తి వేడుకుంటున్నాడు. అసలేం జరుగుతుందో తెలియడం లేదని, భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న పాతుర్ తండాలోనూ ఇలాంటి వింత ప్రమాదాలే వెలుగు చూశాయి. బట్టలు, గడ్డివాములు, ధాన్యం బస్తాలు దానంతట అవే తగలబడిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి కూడా పొగలు రావడంతో తండా ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇలా ఊళ్లో ఎక్కడోచోట, ఏదో మూల, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒకటి తగలబడింది. ఒకరోజు పొలంలో గడ్డివాము తగలబడితే, ఇంకోరోజు ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టం అంటుకుంది. ఏమైందా అని ఆరా తీసే లోపే.. మరొకరి నట్టింట్లో మంటలు రాజుకుంటుంటున్నాయి. ఈ వరుస అగ్ని ప్రమాదాలకు కారణమేంటో తెలియక బిక్కు బిక్కుమంటూ గడిపారు. దాదాపు నెల రోజులకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. దాంతో హడలిపోయిన అక్కడి జనం.. చేతబడి ప్రభావం అయి ఉంటుందని భావించి మంత్రగాళ్లను ఆశ్రయించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ ఇది మిస్టరీగా మిగిలిపోయింది.

Also read:

Best Teachers 2021: సర్వ విద్యా ప్రదాతలు.. తెలుగు రాష్ట్రాల చిన్నారులకు ముద్దుల గురువులు ఈ నలుగురు

Hyderabad: కడుపున పుట్టినవాళ్లే ఆస్తి కోసం వేధించారు.. కన్నీళ్లతో బ్రతకలేక.. తనువు చాలించారు

Sreemukhi : వివాదంలో చిక్కుకున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్.. సినిమా రిలీజ్ ఆపేయాలంటున్న మహిళా సంఘాలు.. కారణం ఇదే