AgriGold: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ అలెర్ట్.. అందుకు గడువు పొడిగింపు

అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్‌ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం....

AgriGold: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ అలెర్ట్.. అందుకు గడువు పొడిగింపు
Ap Agrigold
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 18, 2021 | 6:33 PM

అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్‌ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం ఈనెల 19 సాయంత్రం5 గంటల వరకు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి డిపాజిటర్ల వివరాలను సేకరణ కొనసాగుతోంది. రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులు తమ వివరాలను సరిచూసుకోవచ్చని సీఐడీ తెలిపింది. డబ్బు చెల్లించిన అసలు రసీదులతో వాలంటీర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. వాలంటీర్ల వద్ద వీలు కాకపోతే ఎంపీడీవో కార్యాలయంలో పత్రాలు ఇవ్వాలని తెలిపింది.  సందేహాలకు టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు.  రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి వినతులు రావడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు.

ఏపీ సర్కార్ రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు అకౌంట్లోలో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు కట్టిన డిపాజిట్‌దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్, రశీదులు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వాలంటీర్‌ దగ్గర నమోదు చేయించుకోవాలని సీఐడీ సూచించింది. కోర్టు తెలిపిన జాబితా ప్రకారం పేమెంట్స్ జరుగుతాయి. డిపాజిట్‌దారులకు రావాల్సిన డబ్బును వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు అకౌంట్లను అంగీకరించరు.. ఒక డిపాజిట్‌దారు ఒక క్లెయిమ్‌కే అర్హులు. చనిపోయిన డిపాజిట్‌దారుల డిపాజిట్‌ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు. ఒక్కసారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం అప్లై చేసుకోవాలి. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు జరిపారు.

Also Read:ఆంధ్రాలో కొత్తగా 1,433 కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి

అంజనమ్మ రాకతో అల్యూమినియం ఫ్యాక్టరీలో వెల్లివిరిసిన ఆనందాలు.. చిరు, పవన్ ఫుల్ హ్యాపీ

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?