Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Mother: అంజనమ్మ రాకతో అల్యూమినియం ఫ్యాక్టరీలో వెల్లివిరిసిన ఆనందాలు.. చిరు, పవన్ ఫుల్ హ్యాపీ

మెగా బ్రదర్స్ మాతృమూర్తి  అంజనాదేవి తన కొడుకుల షూటింగ్ లోకేషన్‌లో సందడి చేశారు. చిరంజీవి లూసీఫర్ రీమేక్, పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్..

Chiranjeevi Mother: అంజనమ్మ రాకతో అల్యూమినియం ఫ్యాక్టరీలో వెల్లివిరిసిన ఆనందాలు.. చిరు, పవన్ ఫుల్ హ్యాపీ
Chiranjeevi Mother
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 18, 2021 | 4:52 PM

మెగా బ్రదర్స్ మాతృమూర్తి  అంజనాదేవి తన కొడుకుల షూటింగ్ లోకేషన్‌లో సందడి చేశారు. చిరంజీవి లూసీఫర్ రీమేక్, పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇద్దరి సినిమాల షూటింగ్స్ తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ఈ విషయంలో తెలియడంతో అంజనాదేవి..తన కొడుకులు షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. అయితే ఈ షూటింగ్ సమయంలో పవన్ పోలీసు గెటప్‌లో ఉండగా, చిరంజీవి ఖైదీ గెటప్‌లో ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అమ్మ లోకేషన్‌కు రావడంతో కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా అన్నదమ్ములు షూటింగ్ స్పాట్‌లో  అమ్మతో ముచ్చటించారు. లూసిఫర్ సెట్‌లో కలసి భోజనం చేశారు. లంచ్ తరువాత అమ్మతో కలసి నేరుగా తమ్ముడి సినిమా సెట్‌లోకి వెళ్లి సందడి చేశారు మెగాస్టార్.

దుమ్ము రేపుతోన్న భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌లో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అటు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే… మరోవైపు వరుస సినిమాలు చేస్తూ.. రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.  రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ తెలుగు రీమేక్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి భీమ్లా నాయక్ అనే టైటిల్ డిసైడ్ చేసి ‘ఫస్ట్ గ్లిమ్స్’ రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. భీమ్లా నాయక్ ఫైర్ చూశాక మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విడుదలైన క్షణం నుంచే భారీ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రికార్డులు నెలకొల్పుతోంది.

Also Read: గాంధీ ఆస్పత్రి రేప్‌ మిస్టరీ.. వీడని చిక్కుముడి.. ఘటనపై సర్కార్ సీరియస్

మొదట ‘అయ్యా’ అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత ‘నీ అయ్య’ అంటూ బెండుతీశారు