Vizianagaram: మొదట ‘అయ్యా’ అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత ‘నీ అయ్య’ అంటూ బెండుతీశారు

పూజ చేస్తాం.. దరిద్రం వదిలిస్తాం.. మీ కష్టాల్ని దూరం చేస్తామంటూ నమ్మబలికారు. అందినకాడికి దండుకున్నారు.. అడ్డంగా దోచేశారు. అసలు విషయం...

Vizianagaram: మొదట 'అయ్యా' అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత 'నీ అయ్య' అంటూ బెండుతీశారు
Fake Swamys
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 18, 2021 | 3:32 PM

పూజ చేస్తాం.. దరిద్రం వదిలిస్తాం.. మీ కష్టాల్ని దూరం చేస్తామంటూ నమ్మబలికారు. అందినకాడికి దండుకున్నారు.. అడ్డంగా దోచేశారు. అసలు విషయం ఆలస్యంగా గమనించిన బాధితులు దొంగస్వాముల భరతం పట్టారు. కేటుగాళ్లకు బడితపూజ చేశారు. వివరాల్లోకి వెళ్తే..  విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలం చీడిపాలెం గ్రామంలో దొంగస్వామలు తమ గారడి మాటలతో జనాన్ని మభ్యపెట్టారు. పేదల ఇంట్లోకి వెళ్లిన దొంగ స్వాములు పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయంటూ నమ్మబలికారు. పూజ సామగ్రి, ఇతర ఖర్చుల కోసం 9 వేల 500 చొప్పున వసూలు చేశారు. పూజ చేసి వెళ్లిపోయారు. పరిస్థితులు ఏమాత్రం మెరుగుకాకపోవడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు. పక్క గ్రామాల్లో పూజలు చేస్తున్న దొంగస్వాముల్ని పట్టుకొని నిలదీశారు. వారికి దేహశుద్ధి చేసి గదిలో నిర్బంధించారు. పోలీసులకు విషయం చేరవేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

నల్గొండ జిల్లాలో మరో దొంగబాబా అరెస్ట్..

బీటెక్ చదివాడు. సాప్ట్ వేర్ జాబ్‌లో కిక్ లేదనుకున్నాడో, ఏమో… ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు. అమాయక ప్రజలకు మాయమాటలతో వంచించి డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ బురిడీ బాబా పాపం పడిండింది.  తాజాగా నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ బాబాను నమ్మి మోసపోయిన ఏపీలోని విజయవాడకు చెందిన ఓ మహిళ కంప్లైంట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం… కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ కంప్లీట్ చేశాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను స్టార్ట్ చేశాడు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామస్థులు కొందరు అతడికి భక్తులుగా మారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గ్రామంలో పదెకరాల స్థలాన్ని అందజేశారు. దీంతో ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. అక్కడే సాయిబాబా ప్రవచనాలు చెబుతూ తాయత్తులు కడుతూ హోమాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. 10 నెలల వ్యవధిలో విశ్వచైతన్య కోట్లాది రూపాయల డబ్బు, బంగారం వెనకేసినట్లు స్థానికంగా వార్తలు గుప్పుమన్నాయి. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తానని చెప్పి విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.92 లక్షలు కాజేశాడు. అయితే ఆమె ఆరోగ్యం బాగు కాకపోవడంతో సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ కంప్లైంట్ చేయడంతో ఎస్పీ రంగనాథ్‌ స్పెషల్ టీమ్‌ను నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నగదు బంగారు ఆభరణాలు విలువైన డిపాజిట్‌ బాండ్లు,  ల్యాప్‌టాప్‌లు, ప్రవచన బక్కులను ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Also Read: AP Crime News: కొబ్బరికాయల లోడేలే అనుకున్నారు.. ఫార్మల్‌గా చెక్ చేశారు.. పోలీసుల మైండ్ బ్లాంక్

 ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..155 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ.. చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..