AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subhash Chandra Bose: ఆ దేశంలోని ఫైళ్లలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ .. 100 ఏళ్ల వరకు చెప్పరట ఎందుకంటే

Subhash Chandra Bose: భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. అహింసా మార్గంతో విభేధించి.. సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ..

Subhash Chandra Bose: ఆ దేశంలోని ఫైళ్లలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ .. 100 ఏళ్ల వరకు చెప్పరట ఎందుకంటే
Netaji
Surya Kala
|

Updated on: Aug 19, 2021 | 11:48 AM

Share

Subhash Chandra Bose: భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. అహింసా మార్గంతో విభేధించి.. సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ.. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా.. రాజీనామా చేశాడు. ఓ వైపు దేశం మొత్తం శాంతియుత ఉద్యమంతో.. అహింసామార్గంలో పయనిస్తున్నా.. ఈ తరహా ఉద్యమాలతో పనులు జరవని తెగేసి చెప్పిన ధీరుడు.. తన బాటలో దేశవ్యాప్తంగా వేలాది మందిని పయనింపజేసి.. అజాద్ హింద్ ఫౌజ్ సంస్థకు నూతన జవజీవాలను తీసుకువచ్చిన మహానేత సుబాష్ చంద్రబోస్.

పుట్టుక గురించే తప్ప బోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కథనం. దీనిపైనా భిన్న వాదనలున్నాయి. అసలు ఆ రోజు ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని.. ఆయన గుమ్నానీ బాబాగా చాలా ఏళ్ల పాటు బతికే ఉన్నారని మరో ప్రచారం కూడా ఉంది.  కేంద్ర ప్రభుత్వం వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినా వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు

సుభాష్ చంద్రబోస్ ఎక్కడ, ఎలా మరణించారనే అంశంపై విభిన్న వాదనలున్నాయి. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిపారు.. ఏమయ్యారనే కీలక సమాచారం ఫైలు ఫ్రాన్సులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ చరిత్రకారుడు మోర్‌ ఆ సమాచారం కోరారు. కానీ ఆ వివరాలు వెల్లడించేందుకు ఫ్రెంచ్‌ నేషనల్‌ ఆర్కైవల్‌ అథారిటీ అంగీకరించలేదు. వందేళ్ల వరకూ ఆ ఫైల్‌ను బహిర్గతం చేయరాదని అధికారులు నిర్ణయించినట్లు మోర్‌ తెలిపారు. అందరూ భావిస్తున్నట్లు తైపే విమాన ప్రమాదంలో బోస్‌ మరణించి ఉండకపోవచ్చునని, నిజంగా బోస్‌ అక్కడే మరణించినట్లయితే టోక్యోలో ఉంచిన బూడిదకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే వాస్తవమేంటో తెలిసిపోతుందని ఆయన తెలిపారు. కానీ, డీఎన్‌ఏ పరీక్ష చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లు పరిశోధించిన తాను, ఫ్రెంచ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్‌ ప్రాంతంలోని జైలులో బోస్‌ మరణించినట్లు నిర్ధారించే స్థాయికి వచ్చినట్లు చెప్పారు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, సైగన్‌లో బోస్‌ గడిపిన కాలాన్ని తెలిపే వివరాలున్న ఫైల్‌ను అడిగితే ఫ్రెంచ్‌ అధికారులు ఇవ్వడం లేదన్నారు.

అహింసను తప్పుబట్టనని చెప్పిన ఆయన ఓ వర్గం అలా చేస్తూన్న క్రమంలోనే మరో వర్గమాత్రం ఎదురుతిరగి అంగ్లేయులకు తిరుగుబాటు రుచిచూపించాలని పిలుపునిచ్చాడు. పోరుబాటే తన రూటన్నాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన ధీరుడు బోస్. స్వాతంత్ర్యం ఒకరు మనకిచ్చేదేమిటి.. మనమే తీసుకోవాలని.. అంగ్లేయులను తరమికోట్టాలని పిలుపునిచ్చిన వీరుడు బోస్.

1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు చంద్రబోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారాయన. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుండే వాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ కొట్టాడు బోస్. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్ కు రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించాడు. 1938లో గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా…. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. 1939లో సెకండ్ వాల్డ్ వార్ వచ్చింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు.. ఇదే కరెక్ట్ టైమని భావించిన బోస్… కూటమి ఏర్పాటు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించారు. జపాన్ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేశాడు చంద్రబోస్. హిట్లర్ ను కూడా కలిశారు.

సెకండ్ వాల్డ్ వార్ తర్వాత నిరసనకు దిగిన బోస్.. అండ్ టీమ్ ను జైల్లో పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. బయటికొచ్చిన బోస్ ను హౌజ్ అరెస్ట్ చేశారు. మారువేషంలో మేనల్లుడి సహాయంతో పెషావర్ చేరుకున్నాడు. అట్నుంచి జర్మనీ చేరుకుని అక్కడ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి.. ప్రసారాలు మొదలుపెట్టాడు. 42 వరకు జర్మనీలో ఉన్న బోస్… 1943లో భారత సైన్యంలోకి వచ్చాడు. 1944 జులై 4న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ ఇచ్చిన స్పీచ్ దేశ యువతను ఉత్తేజపరిచింది. మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాను అన్నాడు సుబాష్ చంద్రబోస్. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశాన్ని సైనికరీతిన పోరాడి స్వతంత్ర్యం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాంతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.

Also Read:  అధిక ఉప్పు ఆరోగ్యానికి ముప్పా.. ఎంత మోతాదులో తినాలంటే l