Kashmir : కాశ్మీర్ ప్రత్యేక దేశమంటూ నవజ్యోత్ సిద్దు సలహాదారు వివాదాస్పద వ్యాఖ్యలు…

కాశ్మీర్ ప్రత్యేక దేశమంటూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి వ్యాఖ్యానించి వివాదం రేపారు. కాశ్మీర్ ప్రత్యేక దేశమని, ఇండియా, పాకిస్తాన్ దేశాలు దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాయని ఆయన ట్వీట్ చేశారు.

Kashmir : కాశ్మీర్ ప్రత్యేక దేశమంటూ నవజ్యోత్ సిద్దు సలహాదారు వివాదాస్పద వ్యాఖ్యలు...
Navajot Sidhu Advisor Says Kashmir Is Separate Country
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 19, 2021 | 12:23 PM

కాశ్మీర్ ప్రత్యేక దేశమంటూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి వ్యాఖ్యానించి వివాదం రేపారు. కాశ్మీర్ ప్రత్యేక దేశమని, ఇండియా, పాకిస్తాన్ దేశాలు దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాయని ఆయన ట్వీట్ చేశారు. తాను కాశ్మిర్ ప్రజలకు చెందినవాడినని చెప్పుకున్నారు. ఈ ట్వీట్ కాంగ్రెస్ పార్టీలోనూ, బయట కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కాశ్మీర్ ప్రయోజనాలకోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించినవారిని ఇది అవమానించడమేనని శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజీతా ఆరోపించారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఇండియా-పాకిస్తాన్ దేశాలు అక్రమంగా ఆక్రమించుకున్నాయని కూడా మాలి ఆరోపించారని, దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏమంటారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ దీన్ని అంగీకరించిన పక్షంలో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడుతుందని, లేని పక్షంలో మాలిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్ లో శాంతిని భంగపరచేందుకు పాకిస్థాన్ యత్నిస్తోందని సీఎం అమరేందర్ సింగ్ ఆరోపిస్తుండగా మరోవైపు నవజ్యోత్ సిద్దు పాక్ ఆర్మీ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను హగ్ చేసుకుంటున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు. మాలి వ్యాఖ్యలను సిద్దు సమర్థిస్తారా అని ప్రశ్నించారు.

మల్వీందర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ కూడా తీవ్రంగా తప్పు పట్టింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ పార్టీ నేత వినీత్ జోషీ డిమాండ్ చేశారు. సీదును ఆయన నిలకడ లేని రాజకీయ నేతగా పేర్కొన్నారు. సిద్దు ఇండియాలో నివసిస్తున్నా ఆయన మనస్సు ఎక్కడో పాకిస్థాన్ లోనే ఉంటుందని జోషీ విమర్శించారు. మాలి ట్వీట్ పై సిద్దు స్పందన ఏమిటని కూడా ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.

 70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

 Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.