70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నలు నిత్యం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారవేత్తలను అడుగుతుంటారు. అయితే పన్ను మరియు పెట్టుబడి నిపుణులు దీనికి పెట్టుబడి పెట్టాలని సమాధానాలు ఇస్తుంటారు.భవిష్యత్ సమస్యల నుంచి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే..

70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

|

Updated on: Aug 19, 2021 | 12:42 PM

భవిష్యత్ కోసం డబ్బును ఆదా చేసుకోవడం తప్పనిసరి. అయితే, ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. డబ్బును దాచుకుంటే సరిపోదు. దాచుకున్న డబ్బుపై ఎంత రాబడి వస్తుంది అనేది కూడా ప్రధానమైనదే. ఇందుకోసం డబ్బును క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. లేదా మనకు వచ్చే ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని ప్రతి నెలా సేవింగ్స్ ఎకౌంట్లలో పెట్టడం మరో పద్దతి. మనదేశంలో ఎక్కువ మంది డబ్బును బ్యాంకుల్లో లేదా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టాలని భావిస్తారు. మార్కెట్ రిస్క్ తో సంబంధం లేకుండా అనుకున్న సమయానికి అనుకున్న మొత్తం అందుబాటులోకి వస్తుందని నమ్ముతారు. అది నిజం కూడా.కొద్దిపాటి పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అటువంటి పథకాన్ని పోస్టాఫీస్ అందిస్తుంది. అదే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌. ఇందులో కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడంవలన భారీ రాబడులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పథకం కింద, మీరు మెచ్యూరిటీ వ్యవధిలో అంటే 15 సంవత్సరాలు పూర్తయినప్పుడు లక్షల రూపాయల నిధిని పొందుతారు. ఈ పథకం కింద ప్రతినెలా మీరు 2 వేల రూపాయలు డిపాజిట్‌ చేయాలి. అంటే ప్రతి రోజూ 70 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలను పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే.. 15 సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూరిటీపై7.1 శాతం వడ్డీతో మొత్తం 6 లక్షల 50 వేల రూపాయలు పొందుతారు. 
మరిన్ని ఇక్కడ చూడండి : Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.

 తూటతో ప్రాణం.. పాటతో బంధం..! ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ పాపులర్ అయినా సాంగ్..:Bullettu Bandi song video.

 ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..? టీ20 షెడ్యూల్ మరియు ఐపీఎల్ పై క్లారిటీ..:IPL video.

Follow us