Bezawada Bebakka: ‘దేవుడి పేరుతో ఇలా చేయడం తగదు’.. వినాయక నిమజ్జనంపై బేబక్క పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం

సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గణపతి నిమజ్జనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారి తీసింది.

Bezawada Bebakka: 'దేవుడి పేరుతో ఇలా చేయడం తగదు'.. వినాయక నిమజ్జనంపై బేబక్క పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం
Bezawada Bebakka
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 1:38 PM

దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు మండపాల్లో పూజలందుకున్న గణ నాథులు ఒక్కొక్కరు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకుని నిమజ్జనం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గణపతి నిమజ్జనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదానికి దారి తీసింది. వినాయక నిమజ్జనం వేళ డీజే సౌండ్స్, మ్యూజిక్ లో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక పోస్ట్ పెట్టింది బేబక్క. ఇప్పుడిదే కాంట్రవర్సీకి కారణమైంది. దీనిని చూసిన నెటిజన్లు బేబక్కపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన ఈ వీడియోలో కొంతమంది కుర్రాళ్లు డప్పుచప్పుళ్లు, డీజేలతో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్నారు. ‘అర్ధరాత్రి 12 దాటింది.. అసలు 3 గంటల నుంచి వీళ్లు ఇలానే డప్పులు వాయిస్తూ నే ఉన్నారు. చూశా చూశా కానీ నిద్రపట్టట్లేదు. 12 దాటింది వీళ్లకి ఇప్పుడు నేను కోటింగ్ ఇవ్వబోతున్నా. చూశారా 12 దాటినా కూడా ఈ గోల ఆపట్లేదు. చూడండి వీళ్ల గోల.. కొంచెం చెప్పి చూద్దాం.. వింటారో లేదో’ అంటూ కుర్రాళ్ల దగ్గరికి వెళ్లింది బేబక్క.

‘బాబు ఆపండి.. జై గణేషా.. అర్ధరాత్రి 12 దాటిందమ్మా చాలా మంది పడుకోవాలి. ఇక్కడ పేషెంట్లు కూడా ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి’ అని రిక్వెస్ట్ చేసింది బేబక్క. దీనికి వాళ్లు కూడా పాజిటివ్ గానే స్పందించారు. కాసేపు మ్యూజిక్ ఆపేశారట. కానీ కొద్ది సేపటికే మళ్లీ హంగామా మొదలైందట. దీనిపై స్పందించిన బేబక్క.. ‘నేను రిక్వెస్ట్ చేసిన కొద్ది సేపటికే మళ్లీ నాకు మ్యూజిక్ వినిపించింది. మనందరికీ పండుగలు, దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ దేవుడి పేరుతో ఇలా సామాన్య జనాలను డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో అసలు కరెక్ట్ కాదు. దీనిపై మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని బేబక్క పోస్ట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

బెజవాడ బేబక్క షేర్ చేసిన కాంట్రవర్సీ పోస్ట్..

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు బేబక్కపై మండిపడుతున్నారు. ‘హిందువుల పండగలను చులకనగా చూడకండి మేడమ్’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొందరి నెటిజన్లకు రిప్లై కూడా ఇచ్చింది బేబక్క. ఇందులోకి మతాన్ని లాగొద్దు’ అంటూ రిక్వెస్ట్ చేసింది.

బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో బెజవాడ బేబక్క..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.