AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీ మాటలకు బాలయ్య ఫిదా.. రిలేషన్‏షిప్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆహాలో వస్తోన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గోన్నారు.

Allu Arjun: బన్నీ మాటలకు బాలయ్య ఫిదా.. రిలేషన్‏షిప్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారంటే..
Balakrishna, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2024 | 10:57 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు హాజరయ్యారు. ఇందులో పుష్ప 2 సినిమాతోపాటు తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదివరకే ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ షోలో బన్నీ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈసారి తల్లితోపాటు ఇద్దరు పిల్లలతో కలిసి బన్నీ సందడి చేశారు. ఈ టాక్ షోలో పదవ తరగతి పద్యాన్ని ఆనర్గళంగా చెప్పింది అర్హ. దీంతో బాలయ్యతోపాటు అడియన్స్ సైతం అర్హ తెలుగు నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయారు. ఇక బన్నీ తనయుడు అల్లు అయాన్ తనకు ప్రభాస్, చిరంజీవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

తన మ్యారెజ్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. ప్రతి రిలేషన్ షిప్ లోనూ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. అయితే వాటిని గౌరవించుకోవాలని అన్నారు. ‘రిలేషన్ షిప్ లో నేను బాగా నమ్మేది ఏంటంటే.. అవతలి వారి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఉదాహరణకు మా నాన్న గారు నేను ఒకే ఇంట్లో ఉంటాం. ఈ ప్రపంచంలో మా నాన్నగారి కంటే ఇష్టమైన వ్యక్తి మరెవ్వరూ లేరు. అయినా మా ఇద్దరికీ కొన్ని విషయాల్లో అభిప్రాయాలు వేరు ఉంటాయి. ఆ విషయాన్ని నేను ఎలా చూస్తాను అంటే మా ఇద్దరికీ సబ్జెక్ట్ లో పడడం లేదు.. ఆ సబ్జెక్ట్ వరకే పడడం లేదు.. నీకు నాకు మధ్య బాగానే ఉంది. రిలేషన్ షిప్ లో అందరూ ఒక విషయంలో నో చెబితే తనకు నో చెప్పాడని భావిస్తారు. కానీ అక్కడ ఒక విషయానికి నో చెప్పారు తప్ప మనిషి కాదు.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ రిలేషన్ షిప్ బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ.

ఇవి కూడా చదవండి

దీంతో ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ రిలేషన్ షిప్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారంటూ ఫ్యాన్స్ బన్నీ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.