Nayanthara: 24 గంటల్లో ఆ పనిచేయండి.. లేదంటే.. నయనతారకు మళ్లీ షాకిచ్చిన ధనుష్..

నానుమ్ రౌడీ ధాన్.. ఈ సినిమాలోని మూడు సెకన్ల వీడియోను తన డాక్యుమెంటరీలో ఉపయోగించినందుకు నయనతారకు లీగల్ నోటీసులు పంపించాడు హీరో ధనుష్. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు చేసింది నయన్. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Nayanthara: 24 గంటల్లో ఆ పనిచేయండి.. లేదంటే.. నయనతారకు మళ్లీ షాకిచ్చిన ధనుష్..
Dhanush, Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 19, 2024 | 10:27 AM

లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం, లవ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీపై పెద్ద ఎత్తు వివాదం తలెత్తింది. ఈ సినిమాలోని 3 సెకన్ల వీడియోను ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ రూ.10 కోట్ల లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే నయనతార తన డాక్యుమెంటరీలో 2015 చిత్రం ‘నానుమ్ రౌడీ ధన్’లోని కొన్ని పాటలు, వీడియోలను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని గత రెండేళ్లుగా హీరో ధనుష్ ను అడుగుతున్నానని.. ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని.. దీంతో చివరకు తన డాక్యుమెంటరీలో తన ప్రైవేట్ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన సెట్‌లోని మూడు సెకన్ల వీడియోను ఉపయోగించింది. దీంతో ఆమెకు ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశాడు.

ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంపై నయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రిలీజ్ చేస్తూ ధనుష్ పై విమర్శలు చేసింది. ఇక ఇప్పుడు నయనతారకు మరోసారి షాకిచ్చాడు ధనుష్. తన లాయర్ల ద్వారా ఆమెకు 24 గంటల అల్టిమేటం ఇచ్చాడు. “‘నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీలో నా క్లయింట్ యొక్క ‘నానుమ్ రౌడీ ధన్’లోని కంటెంట్‌ని ఉపయోగించడం ద్వారా మీ క్లయింట్ కాపీరైట్‌లను ఉల్లంఘించారు. కంటెంట్‌ను 24 గంటల్లోగా తీసివేయమని వారికి చెప్పండి. లేదంటే నా క్లయింట్ దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా మీ కంపెనీ, నెట్ ఫ్లిక్స్ నుంచి కేవలం రూ.10 కోట్లు పరిహారం మాత్రమే కాదు.. మరింత ఉంటుంది. ” అని ధనుష్ తరపు లాయర్ హెచ్చరించారు.

అలాగే నయన్ బహిరంగ లేఖలో పేర్కొన్న మొబైల్ ఫోన్ ఫుటేజీ గురించి మాట్లాడుతూ.. ‘నా క్లయింట్ ఈ చిత్రానికి నిర్మాత.. అందుకే సినిమా నిర్మాణానికి ప్రతి పైసా ఎక్కడ ఖర్చు చేశారనే విషయాలు అతడికి తెలుసు. మీరు తెర వెనుక ఫుటేజీని చిత్రీకరించడానికి నా క్లయింట్ ఎవరినీ నియమించలేదు. మీరు చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవమే’ అని పేర్కొన్నారు. మరోవైపు నయనతారకు సినీ తారల నుంచి మద్దతు పెరుగుతుంది. మరోవైపు ధనుష్ కు అండగా ఫ్యాన్స్ నిలబడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!