AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినేనా.. వైరలవుతున్న ఫోటోస్..

టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు కీర్తి సురేష్. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ గారాలపట్టి కీర్తి. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినేనా.. వైరలవుతున్న ఫోటోస్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2024 | 9:54 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది.. కానీ తనదైన నటనతో నటిగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సహజ నటనతో జనాలను మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటుంది కీర్తి. అలాగే నెట్టింట మాత్రం ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తోంది. తాజాగా కీర్తి పెళ్లి రూమర్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త నెట్టింట మరోసారి హల్చల్ చేస్తుంది.

కీర్తి సురేష్ చాలా కాలంగా తన స్నేహితుడు ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందట. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుందని టాక్ నడుస్తుంది. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొచ్చికి చెందినవాడు కావడం విశేషం. డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో తన స్నేహితుడు ఆంటోని తట్టిల్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుందని ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ కీర్తి మ్యారెజ్ గురించి మాత్రం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
Keerthy Suresh Wedding

Keerthy Suresh Wedding

కీర్తి సురేష్ పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ బ్యూటీ మ్యారెజ్ రూమర్స్ హల్చల్ చేశాయి. బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత ఇలా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కీర్తి తల్లిదండ్రులు ఖండించారు. అలాగే తన ప్రేమ, పెళ్లి పై గతంలోనూ కీర్తి క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి రూమర్స్ తెరపైకి వచ్చాయి. మరీ ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.