- Telugu News Photo Gallery Cinema photos TV Actress Hamida Khatoon Latest Half Saree Photos Goes Viral
Hamida: అరెరె.. ఏం వయ్యారం రా సామి.. లంగావోణిలో కవ్విస్తోన్న హమీదా..
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హమీద. ఈ షోలో తన ఆట తీరు, ప్రవర్తనతో చాలా పాపులర్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత నెట్టింట చాలా యాక్టివ్ అయ్యింది..
Updated on: Nov 19, 2024 | 10:51 AM

బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత హమీద బుల్లితెరపై అడుగుపెట్టింది. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా స్వప్న పాత్రలో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అటు నెగిటివ్.. ఇటు పాజిటివ్ నటనతో కట్టిపడేసింది.

దీంతో ఈ అమ్మడుకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే కారణాలు తెలియవు గానీ హమీదా ఉన్నట్లుండి ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. మరో కొత్త నటితో ఆమె పాత్రను రీప్లేస్ చేశారు.

దీంతో హమీదా కొత్త జర్నీ స్టార్ట్ చేయనుందనే ప్రచారం నడిచింది. ఇదిలా ఉంటే.. బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీదా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.

నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. లంగావోణిలో మెస్మరైజ్ చూపులతో కవ్విస్తోంది.

ఇన్నాళ్లు స్క్రీన్ పై అందం, అభినయంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసిన హమీదా.. ఇప్పుడు నెట్టింట కట్టిపడేస్తుంది. దీంతో హమీదా క్రేజీ ఫోటోషూట్స్ పై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్.





























