- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like samantha keerthy suresh krithi shetty moving to bollywood
Tollywood News: టాలీవుడ్‌కు దూరమవుతున్న అందాల భామలు
ప్రజెంట్ ఇండియన్ సినిమాను టాలీవుడే రూల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ టైమ్‌లో కొంత మంది సౌత్ బ్యూటీస్ టాలీవుడ్‌కు దూరమవుతున్నారు. తెలుగులో ఓ వెలుగు వెలిగిన బ్యూటీ... ఖాతాలో ఒక్క తెలుగు సినిమా కూడా కనిపించటం లేదు. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారు అయితే వాచ్ దిస్ స్టోరీ.
Phani CH |
Updated on: Nov 19, 2024 | 1:26 PM

టాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌కు పోటీ పడ్డ స్టార్ హీరోయిన్ సమంత. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇష్యూస్‌తో నటన నుంచి బ్రేక్ తీసుకున్న సామ్, రీ ఎంట్రీలో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్నారు. చివరగా ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తరువాత చేయబోయే తెలుగు సినిమా విషయంలో సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.

మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్‌లో ఓ సినిమాను ఎనౌన్స్ చేసిన సమంత, ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటన్నది ఇంత వరకు రివీల్ చేయలేదు. ఈ గ్యాప్‌లో నార్త్‌లో ఓటీటీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నా, మళ్లీ తెలుగు తెర మీద ఎప్పుడు కనిపిస్తారన్న విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు.

గ్లామర్ క్వీన్‌గా టాలీవుడ్‌ను రూల్ చేసిన పూజా హెగ్డే కూడా ఇప్పుడు తెలుగు సినిమాకు దూరంగానే ఉంటున్నారు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ బ్యూటీ, వరుస ఫెయిల్యూర్స్‌తో డీలా పడిపోయారు. ఆ టైమ్‌లో బాలీవుడ్, కోలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రావటంతో అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తెలుగు తెర మీద మోడ్రన్ మహానటిగా తన మార్క్ చూపించిన కీర్తి సురేష్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగానే ఉంటున్నారు. తమిళ్‌లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ భోళాశంకర్ రిలీజ్ తరువాత ఒక్క తెలుగు సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు.

ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కిట్టిలో ఒక్క తెలుగు సినిమా కూడా కనిపించటం లేదు. డెబ్యూ తరువాత పెద్దగా సక్సెస్‌లు లేకపోవటంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ భామను లైట్ తీసుకున్నారు. దీంతో తమిళ, మలయాళ భాషల్లో బిజీ అయ్యారు బేబమ్మ.





























