- Telugu News Photo Gallery Cinema photos Rajamouli about Pushpa 2 to Kangana Ranaut Emergency latest movie updates from industry
Movie Updates: పుష్పరాజ్ కోసం జక్కన్న.. కంగనా ఎమర్జెన్సీ కొత్త డేట్..
పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌పై సోషల్ మీడియాలో స్పందించారు దర్శక ధీరుడు రాజమౌళి. మాస్ యాక్షన్ రోల్‌లో నయన్ కొత్త మూవీ టైటిల్ టీజర్ రివీల్. సీనియర్ హీరో అర్జున్ సర్జకి అరుదైన గౌరవం. భాగీ సిరీస్‌లో ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్‌ను ఎనౌన్స్ చేశారు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. మరోసారి ఎమర్జెన్సీ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు కంగనా రనౌత్. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఈరోజు చూద్దాం..
Updated on: Nov 19, 2024 | 1:33 PM

పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌పై సోషల్ మీడియాలో స్పందించారు దర్శక ధీరుడు రాజమౌళి. 'పాట్నాలో మొదలైన వైల్డ్ ఫైర్, దేశమంతా వ్యాపిస్తోంది. పుష్ప పార్టీ కోసం వెయిటింగ్' అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె నెక్ట్స్ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రివీల్ చేశారు మేకర్స్. రక్కయీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నారు నయన్. సెంథిల్ దర్శకత్వం వహిస్తున్నారు.

మల్టీ లింగ్యువల్ స్టార్ అర్జున్ సర్జను ఎంజీర్ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సినీ రంగంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు కూడా ఈ డాక్టరేట్‌ను అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో అర్జున్ డాక్టరేట్ అందుకున్నారు.

భాగీ సిరీస్‌లో ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్‌ను ఎనౌన్స్ చేశారు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. సాజిద్ నదియావాల నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ హర్ష దర్శకుడు. ఇప్పటి వరకు భాగీ సిరీస్‌లో భాగంగా సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ వచ్చారు టైగర్. ఇప్పుడు ఫోర్త్ మూవీని ఏ సౌత్ మూవీకి రీమేక్‌గా ప్లాన్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోసారి ఎమర్జెన్సీ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు కంగనా రనౌత్. 2025 జనవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా వెళ్లడించారు. కంగనా రనౌత్ స్వయంగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ ఆలస్యమైంది.




