- Telugu News Photo Gallery Cinema photos Reason behind organizing Pushpa 2 trailer launch event in Bihar
Pushpa 2: పుష్ప అంటే ఇప్పుడు పేరు కాదు..పాన్ వరల్డ్ బ్రాండ్..
ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కు ఏ మాత్రం సంబంధం లేని పాట్నాలో పుష్ప-2 ఫస్ట్ ఈవెంట్‌ను నిర్వహించింది టీమ్. బన్నీ తీసుకున్న నిర్ణయానికి బిహారీల నుంచి మంచి భారీ స్పందన వచ్చింది. నార్త్‌లో పెద్దగా అంచనాలు లేని ఈ ఈవెంట్‌ను..అంచనాలకు అందని రేంజ్‌లో సక్సెస్ చేసి చూపించారు ఫ్యాన్స్.
Updated on: Nov 18, 2024 | 9:08 PM

బన్నీ ఫ్యాన్స్‌తో పాటు..పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2’ ట్రైలర్ వచ్చేసింది. రావడం రావడంతోనే పాత రికార్డుల బూజు దులిపేసింది. పుష్ప స్థాయి నేషనల్ కాదు..ఇంటర్నేషనల్ అంటూ ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా ఉంది..పుష్ప-2 ట్రైలర్.

పాట్నా వేదికగా రిలీజ్ అయిన పుష్ప-2 ట్రైలర్..యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కోట్ల వ్యూస్‌తో రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ట్రైలర్‌తోనే కాదు.. భారీ ఈవెంట్‌తోనూ బిహార్‌లో చరిత్ర సృష్టించింది..పుష్ప మూవీ యూనిట్. సౌత్ సినిమా అంటే సాధారణంగా హైదరాబాద్‌లోనే గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక వేళ నార్త్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తే ముంబైలో ఈవెంట్ చేస్తారు. రాజమౌళి కూడా తన గత చిత్రాల విషయంలో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేశారు అల్లు అర్జున్.

మనం చేసిన పని సక్సెస్ అయిందా? కాలేదా? అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

బీహార్‌లో ఈవెంట్‌ను ఏర్పాటు చేయటం వెనుక రీజనేంటో కూడా రివీల్ చేశారు..అల్లు అర్జున్. పుష్ప ఫస్ట్ పార్ట్‌ను కోవిడ్ కష్టాల్లోనూ బిహార్ ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. అందుకే ఆ కృతజ్ఞతతోనే పుష్ప-2 తొలి ఈవెంట్‌ను పాట్నాలో ఏర్పాటు చేశామన్నారు. గాంధీ మైదానంలో జాతర సెట్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్..ఇండియన్ సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. బిహార్ చరిత్రలో ఇదే అతిపెద్ద మూవీ ఈవెంట్. 900 మంది పోలీసులతో పాటు 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో బిహార్ కార్యక్రమానికి భద్రత కల్పించింది..బిహార్ ప్రభుత్వం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు..బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా .

‘‘పుష్ప’ ఎప్పుడూ తగ్గడు..కానీ మీ ప్రేమ కోసం తగ్గుతాడు’’ అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు అల్లు అర్జున్. అభిమానుల కోరిక మేరకు ‘పుష్ప 2’లోని హిందీ వెర్షన్ డైలాగ్ చెప్పి అలరించారు. అభిమానుల ఊహాలకు మించి..పుష్ప-2 మూవీ ఉంటుందన్నారు..హీరోయిన్ రష్మిక. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్..బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ బెల్ట్ లో సైతం పుష్ప ది రైజ్ కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప ది రూల్‌పై..భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో పార్ట్-2ను రూపొందించారు..మేకర్స్. ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.





























