- Telugu News Photo Gallery Cinema photos Mathu vadalara 2 Actress Faria Abdullah shared her latest Stunning photos
Faria Abdullah: క్యాజువల్ లుక్‌లోనే కేక పెట్టిస్తున్న క్యూటీ.. ఫిదా చేస్తున్న ఫరియా
రీసెంట్ గా మత్తు వదలరా 2 సినిమాలో నటించి మెప్పించింది. మత్తువదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
Updated on: Nov 18, 2024 | 8:53 PM

ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.

అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించిందీ హైదరాబాదీ అమ్మాయి. ఆతర్వాత బిజీగా మారిపోయింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. చేసింది చిన్న పాత్రే అయినా ఆకట్టుకుంది.

అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది.

కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాలో నటించి మెప్పించింది. మత్తువదలరా 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

అంతే కాదు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్తకొత్త ఫొటోలతో కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ డ్రస్ లో వయ్యారాలు ఒలకబోసింది. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.





























