Bagheera OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ బఘీర.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు అతనితో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు తీస్తున్నారు. డైరెక్షన్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఇటీవల బఘీరా అనే ఒక పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కథ అందించాడు.

Bagheera OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ బఘీర.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Bagheera Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 9:59 PM

ఉగ్రం హీరో శ్రీమురళి నటించిన ‘బఘీర’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు కన్నడలో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బరిలో క, లక్కీ భాస్కర్, అమరన్ వంటి సినిమాలు ఉండడం,అన్నిటికీ పాజిటివ్ టాక్ రావడంతో బఘీరా పెద్దగా ఆడలేకపోయింది. అయితే ఈ ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన కేవలం 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ రూట్‌లోకి రావడం గమనార్హం. డాక్టర్ సూరి దర్శకత్వంలో శ్రీ మురళి, రుక్మిణి వసంత్ తదితరులు నటించిన చిత్రం ‘బఘీరా’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రాన్ ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం విశేషం. కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సాధారణంగా, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లు కన్నడ సినిమాలు కొనుగోలు చేసేందుకు పోటీపడతాయి. అయితే, నెట్‌ఫ్లిక్స్ మొదటి నుండి దీనిపై ఆసక్తి చూపుతోంది. ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని కన్నడ సినిమాలు మాత్రమే ఉన్నాయి.

‘బగీరా’ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణితో పాటు ప్రకాష్‌రాజ్, అచ్యుత్ కుమార్, రంగాయణ రఘు, గరుడ రామ్ నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ,సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. అక్టోబర్ 31న థియేటర్లలో ఈ పాన్ ఇండియా సినిమా రిలీజైంది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. కేజీఎఫ్, సలార్ సినిమాల్లాగానే యాక్షన్ కు పెద్ద పీట వేయడం, పెద్దగా కథ లేకపోవడంతో బఘీరా సినిమా తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కన్నడలో ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చినా తెలుగులో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. అయితే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు బఘీరాపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

బఘీరా తెలుగు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి