- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun talk about Pushpa 2 the rule and Director Sukumar in Unstoppable with NBK Show
Unstoppable 4: సీజన్లు మారిన ఊపు తగ్గని బాలయ్య.! బన్నీ పర్సనల్స్ బయటకి లాగడ.?
బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. మొన్నటిదాకా అన్‌స్టాపబుల్‌లో బన్నీ చెప్పిన ముచ్చట్లు.. నిన్నటికి నిన్న పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ట్రైలర్ టాక్.. ఇప్పుడు పిల్లలతో పుష్పరాజ్... ఇదీ సంగతి. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో చూస్తే.. మనం మాట్లాడుకుంటున్న విషయానికి పక్కా లీడ్ దొరికినట్టే.! అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాటర్ అర్హ చెప్పిన పద్యం విన్నారా.?
Updated on: Nov 21, 2024 | 7:07 PM

బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. మొన్నటిదాకా అన్‌స్టాపబుల్‌లో బన్నీ చెప్పిన ముచ్చట్లు.. నిన్నటికి నిన్న పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

ట్రైలర్ టాక్.. ఇప్పుడు పిల్లలతో పుష్పరాజ్... ఇదీ సంగతి. అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో చూస్తే.. మనం మాట్లాడుకుంటున్న విషయానికి పక్కా లీడ్ దొరికినట్టే.!

అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాటర్ అర్హ చెప్పిన పద్యం విన్నారా.? అల్లసాని పెద్దన వింటే అమాంతం పొంగిపోయేవారేమో..

అంతగా మెప్పించింది అన్‌స్టాపబుల్ ప్రోమో.. బాలయ్య అయితే ఏకంగా అర్హను దగ్గరకు తీసుకుని.. పది కాలాలపాటు తెలుగు చల్లగా ఉంటుందని మెచ్చుకున్నారు.

ఇక అయాన్ గురించి చెప్పాలా? యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్ లెక్క.. మా అబ్బాయి అని అల్లు అర్జున్ చెబుతుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

నాన్నంటే అయాన్‌కి ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేసింది ఈ క్లిప్. పుష్ప మూవీ మాస్ జాతర లాగా ఎలా మెప్పిస్తుందో డిక్లేర్ చేశారు బన్నీ.

అంతే కాదు.. ఫ్యామిలీ గురించి, లైఫ్ స్టైల్ గురించి... చాలా చెప్పారు. ఇలాంటి ఎన్నెన్నో.. ఎన్నో... విశేషాలతో ముస్తాబవుతోంది ఈ వారం అన్‌స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్.. డోంట్ మిస్... ఆహాలో తప్పక చూడండి.




