Allu Arjun : చిరంజీవిపై ప్రేమను బయటపెట్టిన అల్లు అర్జున్.. ఏమని పిలుస్తాడో తెలుసా..

నందమూరి బాలకృష్ణతో కలిసి అన్‏స్టాపబుల్ టాక్ షోలో అల్లు అర్జున్ సందడి చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో తన కెరీర్ విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బన్నీ. అలాగే ఇదే షోలో చిరంజీవిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు.

Allu Arjun : చిరంజీవిపై ప్రేమను బయటపెట్టిన అల్లు అర్జున్.. ఏమని పిలుస్తాడో తెలుసా..
Megastar Chiranjeevi, Allu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 22, 2024 | 11:47 AM

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. గతంలో పుష్ప ది రైజ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని పుష్ప 2 ది రూల్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు సుకుమార్. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు బన్నీ. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాగా… ఇప్పుడు సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బన్నీ తనయుడు అయాన్, కూతురు అర్హ సందడి చేశారు. అలాగే ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు బన్నీ.

“చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారితో రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. 20 ఏళ్ల తర్వాత నేను ఆయనతో ఎలా ఉన్నానో తెలుసు.. కానీ 20 ఏళ్ల ముందు చిరంజీవిగారితో ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా నాకు ఆయనంటే అభిమానం. నా చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ ఫారిన్ తీసుకెళ్లిన మొదటి వ్యక్తి చిరంజీవిగారే. ఆయన అనుకుంటే వాళ్ల కుటుంబంవరకే వెళ్లొచ్చు. కానీ మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. ఆ రోజుల్లో అంతమంది పిల్లలను తీసుకెళ్లడం అసాధ్యం. అలాంటిది ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు.. ఆయనను నేను చిక్ బాబాయ్ అని పిలుస్తాను.. మా తాతయ్య రామలింగయ్య గారికి ఆయన చాలా గౌరవమిస్తారు. ఒక్కోసారి మా నాన్న కూడ ఇవ్వనంత గౌరవం ఇస్తారు ” అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. చిరు గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

అలాగే తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపిస్తూ.. వినిపిస్తూ.. నేను పట్టుకోగలిగే దేవుడు మా నాన్న. ఈ ప్రపంచంలో నా ఫేవరెట్ పర్సన్ మా నాన్న’ అని అన్నారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.