AR Rahman: విడాకులపై స్పందించిన రెహమాన్.. అసలు ఎందుకు విడిపోతున్నారంటే..

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటే పరిచయం అవసరం లేని పేరు. సంగీతమే అతడిని ప్రపంచానికి పరిచయం చేసింది. సంగీత కుటుంబంలో పుట్టిన రెహమాన్ ప్రయాణం అంత తేలిక కాదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు మూప్పై ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు రెహమాన్ దంపతులు.

AR Rahman: విడాకులపై స్పందించిన రెహమాన్.. అసలు ఎందుకు విడిపోతున్నారంటే..
Ar Rahman
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 20, 2024 | 6:55 AM

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని.. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగానే ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు.

‘మేము సంతోషంగా ముప్పైకి చేరుకోవాలని ఆశించాము. కానీ అన్ని విషయాలు కనిపించని ఒక ముగింపును కలిగి ఉంటాయని తెలిగింది. ముక్కలైన హృదయాల బరువుకు ఆ దేవుడి సింహాసనం సైతం వణుకుతుంది. అయినా ఈ ముగింపులో మేము మరో అర్థాన్ని వెతుకుతున్నాము. విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా కనిపించవు’ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. సైరాతో గడిపిన మూడు దశాబ్దాల జీవితాన్ని ముగించడంపై రెహమాన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులలో తన స్నేహితులకు, బంధువులు చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

రెహమాన్ తన కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచడానికి ఇష్టపడుతుంటాడు. రెహమాన్ అంతర్జాతీయ స్టార్‌డమ్‌కి ఎదుగుతున్న సమయంలో కాల పరీక్షను తట్టుకుని నిలబడేందుకు సైరా బాను అండగా నిలిచింది. వీరిద్దరి వివాహం 1995లో జరిగింది. పెళ్లైన దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి భావోద్వేగపూరితమైన గాయమని సైరా బాను తరపు లాయర్ ప్రకటించారు.

ఏఆర్ రెహమాన్ ట్వీట్.. 

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..