Tollywood: 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇండస్ట్రీలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..

బుల్లితెర ప్రపంచంలో ఆమె అగ్రనటి. సీరియల్లలో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు బిగ్ బాస్ రియాల్టీ షోలోనూ పాల్గొంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ సైతం ఆమె కావడం విశేషం.

Tollywood: 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇండస్ట్రీలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..
Shwetha Thiwari
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2024 | 11:38 AM

సినీరంగుల ప్రపంచంలో నటిగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు ఒకప్పుడు బుల్లితెరపై సత్తా చాటినవారే. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటారు. కానీ అంతకు ముందే టీవీ సీరియల్స్ లో మెయిన్ రోల్స్ పోషించి తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. కానీ మీకు తెలుసా.. దేశంలోనే అత్యంత అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటి ఎవరో. మీరు విన్నది నిజమే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలన్నింటిలోనూ ఆ నటి అత్యదిక పారితోషికం తీసుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. సీరియల్ నటి శ్వేతా తివారి.

హిందీలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సీరియల్ ‘కసౌటి జిందగీ కె’ సీరియల్లో శ్వేతా తివారి ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ పై ఈ సీరియల్ దాదాపు ఏడేళ్లపాటు సక్సెస్ ఫుల్ గా సాగింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. అందులో విజేతగా నిలవడంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత సైతం ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. సినిమాల్లో కాకుండా కేవలం సీరియల్స్, టీవీ షోల ద్వారానే పాపులర్ అయ్యింది శ్వేతా.

ఇవి కూడా చదవండి

అయితే రంగుల జీవితం ఎంతో విజయవంతంగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోసార్లు ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండుసార్లు ప్రేమలో మోసపోయింది. శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారి జన్మించింది. అయితే మనస్పర్థల కారణంగా 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించారు. తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నడాని 2019లో కోర్టును ఆశ్రయించగా.. అదే ఏడాది విడాకులు తీసుకున్నారు. నివేదికల ప్రకారం శ్వేతా తివారీ ఆస్తులు రూ.81 కోట్లు అని సమాచారం.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!