OTT Movie: మనుషులను చంపి తినే కుటుంబం.. సీన్ సీన్‌కు గుండె ఆగిపోయే ట్విస్టులు.. ఒంటరిగా చూడాలంటే సాహసమే..
ఓటీటీలో ఈమధ్యకాలంలో హారర్ కంటెంట్ చిత్రాలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ప్రతిసీన్ ట్విస్టులతో సాగే సస్పెన్స్.. ఊహించని మలుపులతో కూడిన సన్నివేశాలు మీకు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హారర్ మూవీ మాత్రం మరింత భయానకం. ఈ సినిమాను ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.

ఈ రోజుల్లో ఓటీటీలో వస్తున్న హారర్ చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఆ జానర్ సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల మనస్సులలో లోతైన ముద్ర వేశాయి. అలాంటి ఒక హారర్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది టెక్సాస్ చైన్ సా మాసకర్’. ఇందులో ఐదుగురు యువకులు టెక్సాస్‌లో తమ ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంతో ప్రారంభిస్తారు. కానీ వారి ప్రయాణం భయంకరమైన మలుపు తీసుకుంటుంది. వీరంతా ఒక ఫామ్‌హౌస్ దగ్గర చిక్కుకుంటారు. అక్కడ వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారి జీవితాలను నరకంగా మారుస్తాయి.
ఈ కథ 1973లో టెక్సాస్ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో సమాధి దోపిడీ వార్తలు ప్రజల్లో భయాన్ని పెంచుతాయి. దీంతో సాలీ హార్డెస్టీ అనే యువతి, ఆమె అన్నయ్య ఫ్రాంక్లిన్ హార్డెస్టీ, ముగ్గురు స్నేహితులు జెర్రీ, కిర్క్, పామ్ తమ తాత సమాధి సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వ్యాన్‌లో రోడ్ ట్రిప్‌కు వెళతారు. వారు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తారు. అతడు వింతగా ప్రవర్తిస్తూ తన కుటుంబం, పాత కబేళా గురించి చెబుతూ.. తమతో ప్రయాణిస్తున్న ఫ్రాంక్లిన్‌ను కూడా కత్తితో పొడిచి చంపుతాడు. వెంటనే అతడిని బయటకు పంపించి వారంతా పారిపోతారు.
కొద్ది దూరం నడిచిన తర్వాత వారు ఒక పెట్రోల్ పంపు వద్ద ఆగుతారు. అయితే పెట్రోల్ అందుబాటులో ఉండదు. దీంతో వారంతా సమీపంలోని సాలీ తాత ఇంటికి వెళతారు. కిర్క్, పామ్ ఇంటి చుట్టూ తెలుసుకోవడానికి వెళ్లగా దారిలో ఒక ఫామ్‌హౌస్‌ను చూస్తారు. ఆ స్థలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో కిర్క్ లోపలికి వెళ్తాడు కానీ భయంకరమైన ముసుగు ధరించిన వ్యక్తి చేతిలో హత్యకు గురవుతాడు. అతను ‘లెదర్‌ఫేస్’. లెదర్‌ఫేస్ కుటుంబం నరమాంస భక్షక కుటుంబం. వారు మానవ మాంసాన్ని తిని బతుకుతారు. ఇక పామ్ స్నేహితులను ఒక్కొక్కరిని చంపి తినేస్తారు. చివరు సాలీ తన ప్రాణాల కోసం పోరాడుతుంది. చివరకు సాలీ ఏమైందీ..? ఆమె తనను ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది టెక్సాస్ చైన్ సా మాసకర్’. 1974లో విడుదలైన ఈ చిత్రానికి టోబ్ హూపర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








