OTT Movie: ఆ హైవేపై ఏం జరిగింది? ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఐఎండీబీలో 8.1 రేటింగ్
గత వారం ఎన్నో కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఓ సినిమాను మాత్రం ఓటీటీ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. అందుకే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది.

ఓటీటీలో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలదే హవా. అందుకే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఈ జానర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను కూడా ఆయా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందినదే. రిలీజ్ కు ముందే ఈ సినిమా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శితమైంది. ఇక గత నెలలోనూ థియేటర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక గతవారమే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. IMDb ఈ సినిమాకి 8.1/10 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా ముంబైలోని పుణే హైవే నేపథ్యంగా సాగుతుంది. ఖండూ, విష్ణు , నిక్కీ, నటాషా, బాబు బాల్య స్నేహితులు. ముంబైలో సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు పూణే హైవేలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో బాబు పక్షవాతానికి గురవుతాడు. ఇది జరిగిన ఏడాదికి పుణే హైవేకు 200 కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సులో, ఒక గుర్తు తెలియని శవం బయటపడుతుంది. ఈ హత్య ఐదుగురి స్నేహితుల జీవితాలను కుదిపేస్తుంది. ఇక ఈ శవం ఎవరిదో తెలిసినప్పుడు వీరి స్నేహం కూడా వీగిపోతుంది.
ఇక పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తూ విష్ణు మాజీ భార్య నటాషా, వీడియొ లను రికార్డ్ చేసే అలవాటు ఉన్న నిక్కీని అనుమానితులుగా చేర్చుతారు. అంతేకాదు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు బయటికి వస్తాయి. మరి చెరువులో దొరికిన మృతదేహం ఎవరిది? ఆ హత్య చేసింది ఎవరు ? ఎందుకు చేస్తారు ? చివరకు ఏమైంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సపెన్స్ థ్రిల్లర్ సినిమాని చూడాల్సిందే.
ఈ సినిమా పేరు పుణే హైవే. కుబేర విలన్ జిమ్ సర్భ్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే మిత్ సాధ్, జిమ్ సర్భ్, అనువాబ్ పాల్, మంజరీ ఫడ్నిస్, కేతకి నారాయణ్, సుదీప్ మోడక్ వంటి నటులు నటించారు. ప్రస్తుతం ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
#NowWatching #PuneHighway on @PrimeVideoIN
Featuring one of my fav telly-turned-TV actor #AmitSadh pic.twitter.com/44UyEwB9qb
— Archana aka Renjith Akka (@akkaonfire) July 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








