AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో మీకు తెలుసా.. ? ఇప్పుడు ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా..

OTT Movie: తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
Sultan Ott
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2025 | 5:40 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ అంశాలతో కలగలిపిన ఈ చిత్రం అన్ని వయసుల సినీప్రియులను కట్టిపడేసింది. కొన్నాళ్ల క్రితం థియేటర్లలో ఆధిపత్యం చెలాయించింది. వరుస ప్లాపులలో సతమతమవుతున్న ఓ స్టార్ హీరోకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో మీకు తెలుసా..? అదే సుల్తాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఇది. 2016లో విడుదలైన ఈ భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఏ స్తాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

ఈ చిత్రం జూలై 6, 2016లో విడుదలైన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత కాగా, విశాల్-శేఖర్ సంగీతం అందించారు. ఇందులో సుల్తాన్ అలీ ఖాన్ అనే రెజ్లర్.. తన కొడుకు మరణం తర్వాత రెజ్లింగ్ వదిలివేస్తాడు. కానీ అతను తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటాడు. అందుకే ఎలాగైనా రెజ్లింగ్ లో గెలిచి మళ్లీ తన గౌరవం సంపాదించుకోవాలనుకుంటాడు. ఇందులో సల్మాన్ కాన్, అనుష్క శర్మ జంటగా నటించారు. 2018న చైనాలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

నివేదికల ప్రకారం ఈ సినిమా రూ.80 కోట్లతో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.623.33 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా రిజర్వేషన్ల విషయంలో సుల్తాన్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా రూ.421 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది. ఇక ఈ సినిమాలో దాదాపు 9 పాటలు ఉండగా.. సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో రణదీప్ హుడాతో పాటు, అమిత్ సాధ్, టైరోన్ వుడ్లీ మరియు కుముద్ మిశ్రా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..

Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..

Tollywood : అప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్‏గా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏తో రచ్చ.. ఎవరంటే..

Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్‏లో ఊహించని విధంగా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..