Viral: ఆశ్చర్యపరుస్తోన్న మామిడి చెట్టు.. మీ వద్ద కూడా ఇలాగే ఉంటుందా?!
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మామిడి చెట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పచ్చగా ఉన్న చెట్టుకు ఒక వైపు మాత్రమే మామిడి పూత రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మామిడి చెట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పచ్చగా ఉన్న చెట్టుకు ఒక వైపు మాత్రమే మామిడి పూత రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడలేదని, వింతగా చూస్తున్నారు జనం. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలోని ఓ మామిడి చెట్టు విరబూసింది. కానీ ఒక్క వైపు మాత్రమే పూత విరగబూసింది..కానీ మరోవైపు చెట్టు పచ్చగా ఉన్నప్పటికీ ఒక్క కొమ్మకు కూడా పూత రాలేదు. ఇదంతా వింతగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి చూసి వెళుతున్నారు.
మరోవైపు ఉద్యానవన శాఖ కు చెందిన అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్లారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వింతను చూడలేదని, ఈ చెట్టు కూడా గతంలో బాగా కాత నిచ్చేదని చెబుతున్నారు రైతు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని రైతులు భావిస్తున్నారు. మరోవైపు వేప చెట్ల మాదిరిగా మామిడి చెట్లకు కూడా ఏమైన తెగులు వచ్చాయా అని భయపడిపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వింతపై అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
