U-19 World Cup: మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ ఫైనల్.. కూతురు ఆటను కళ్లారా చూసేందుకు ఇన్వర్టర్ కొన్న తల్లి
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. షెఫాలీ వర్మ సారథ్యంలో మేటి జట్లను మట్టి కరిపించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కాగా ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా దేవి.
ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తోన్న అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముహూర్తం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో వరల్డ్ కప్ టైటిల్ కోసం భారత్, ఇంగండ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కోసం టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత అమ్మాయిలు టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని గెలవాలంటూ ఆకాంక్షిస్తూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. షెఫాలీ వర్మ సారథ్యంలో మేటి జట్లను మట్టి కరిపించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కాగా ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా దేవి. స్పిన్ బౌలర్‌గా వికెట్లు పడగొడుతూనే అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. కాగా యూపీలోని ఒక కుగ్రామానికి చెందిన అర్చానా చిన్నతనంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆతర్వాత కొన్నేళ్లకే పాము కాటుకు సోదరుడు బలయ్యాడు. తల్లి చిన్నచితకా పనులు చేసుకుంటూ అర్చనను చదివించింది. అక్కడే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుని దానినే కెరీర్‌గా ఎంచుకుంది.
డబ్బులు పోగేసి మరీ… కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కూగ్రామంగా ఉన్న ఉన్నావ్‌లో విద్యుత్ సరఫరా సరిగా ఉండదట. కేవలం ఎనిమిది గంటలు మాత్రమే కరెంటు మాత్రమే ఉంటుందట. ఈ క్రమంలో అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరిందన్న సంగతతి తెలుసుకుని అర్చన తల్లి సావిత్రి తెగ సంబరపడిపోయారట. ఇవాళ జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కూతురి ఆటను కళ్లారా చూడాలనుకుందామె. అయితే కరెంటు సరఫరా సమస్య అందుకు అడ్డంకిగా మారింది. కూతురు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్ ఉన్నా అందులో బ్యాటరీ ఎంత సేపు ఉంటుందో తెలియదు. దీంతో ఒక ఆలోచన చేశారు సావిత్రి. ఊర్లో ఉన్న అందరి ఇళ్లకు వెళ్లి తన బిడ్డ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని.. ఆ మ్యాచ్‌ను అందరూ చూద్దామని .. తలా కొంత డబ్బులేసుకొని ఒక ఇన్వర్టర్ కొందామని చెప్పింది. తమ ఊరి పేరును అందరికీ వినిపించేలా చేసిన ఆ గ్రామస్తులు కూడా సావిత్రికి అండగా నిలబడ్డారు. తమకు తోచినంత సహాయం చేశారు. అలా వచ్చిన డబ్బుతో ఇన్వర్టర్ కొనేసింది. మొత్తానికి ఊరి సమక్షంలో తన కూతురు మ్యాచ్‌ను కళ్లారా చూసేందుకు సావిత్రి అంతా సిద్ధం చేసుకున్నారు.
A Gold-standard meeting! ??
Javelin thrower & Olympic Gold medallist @Neeraj_chopra1 interacted with #TeamIndia ahead of the #U19T20WorldCup Final! ? ? pic.twitter.com/TxL5afL2FT
— BCCI (@BCCI) January 28, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..