Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే బ్యాట్స్‌మెన్స్.. లిస్టులో భారత ప్లేయర్.. ఎవరంటే?

ఇక, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టిన లిస్టులో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ఘనత సాధించిన లిస్టులో కేవలం ఇద్దరే ప్లేయర్లు ఉన్నారు. వారిలో ఒకరు అద్భుతమైన బ్యాట్స్‌మెన్ కాగా మరొకరు తుఫాన్ ఆల్ రౌండర్. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL: ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరే బ్యాట్స్‌మెన్స్.. లిస్టులో భారత ప్లేయర్.. ఎవరంటే?
Ipl History Sixes
Follow us
Venkata Chari

|

Updated on: Jan 29, 2023 | 1:55 PM

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు చూశాం. ఐపీఎల్‌లో చాలా మంది అద్భుతమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వారు తమ బ్యాటింగ్‌తో అభిమానులను ఎంతగానో అలరించారు. కాగా, ఈ లీగ్‌లో మ్యాచ్‌లు తరచుగా అత్యధిక స్కోరింగ్‌గా నిలుస్తుంటాయి. ఇందులో ఫోర్లు, సిక్స్‌ల వర్షం కురుస్తుండడమే దీనికి కారణం. ఐపీఎల్ చరిత్రలో ఫోర్లు, సిక్సర్లతో ఫేమస్ అయిన ఇలాంటి బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. దాదాపు ప్రతి సీజన్‌లో తమ బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ, అభిమానులకు అలరిస్తుంటారు.

కాగా, ఒకే ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టడం చాలా సార్లు జరిగింది. సాధారణంగా ఒక ఓవర్‌లో 2-3 సిక్సర్లు కొట్టడం కాస్త తేలికే.. కానీ, ఒక బ్యాట్స్‌మెన్ ఒకే ఓవర్‌లో 5 లేదా 6 సిక్సర్లు కొట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇక, ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టిన లిస్టులో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ఘనత సాధించిన లిస్టులో కేవలం ఇద్దరే ప్లేయర్లు ఉన్నారు. వారిలో ఒకరు అద్భుతమైన బ్యాట్స్‌మెన్ కాగా మరొకరు తుఫాన్ ఆల్ రౌండర్. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

2. రాహుల్ తెవాటియా vs షెల్డన్ కాట్రెల్ (IPL 2020):

ఐపీఎల్ 13వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియా ఈ ఫీట్ చేశాడు. రాజస్థాన్ 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరిన తర్వాత రాహుల్ తెవాటియా క్రీజులోకి వచ్చాడు.

అయితే, రాహుల్ తెవాటియా బ్యాట్ తొలి 20 బంతుల్లో ఎలాంటి పరుగులు చేయలేదు. అతని స్ట్రైక్ రేట్ 50 కంటే తక్కువగా ఉంది. మరోవైపు సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా రాహుల్‌ తెవాటియా చాలా డాట్‌ బాల్స్‌ ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో, రాబిన్ ఉతప్ప వంటి బ్యాట్స్‌మెన్ డగౌట్‌లో ఉండగా, మొదట తెవాటియాను పంపి రాజస్థాన్ రాయల్స్ పెద్ద తప్పు చేసిందా అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తారు.

చివరి క్షణాల్లో రాహుల్ తెవాటియా తన సత్తా చాటాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత, షెల్డన్ కాట్రెల్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. కాట్రెల్ వేసిన ఈ ఓవర్‌లో తెవాటియా వరుసగా 5 సిక్సర్లు బాదాడు. చివరికి రాజస్థాన్ రాయల్స్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద పరుగుల వేటగా నిలిచింది. తెవాటియా 5 సిక్సర్లు మొత్తం మ్యాచ్‌ని మలుపు తిప్పాయి.

1. క్రిస్ గేల్ vs రాహుల్ శర్మ (IPL 2013):

ఐపీఎల్ ఆరో సీజన్‌లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్‌లో పుణె వారియర్స్ ఇండియాపై 175 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గేల్ ఆకట్టుకున్నాడు. ఇది ఇప్పటికీ టీ20 క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్‌గా పేరుగాంచింది.

ఈ ఇన్నింగ్స్‌లో పుణె వారియర్స్ భారత స్పిన్నర్ రాహుల్ శర్మపై క్రిస్ గేల్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..