Viral: అంతర్జాతీయ మ్యాచ్‌లో లెగ్ అంపైర్ ఘోర తప్పిదం.. ఫైరవుతోన్న నెటిజన్స్.. ఏం చేశాడో తెలుసా?
South Africa vs England: జనవరి 27న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ (SA vs ENG) మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ చేసిన పెద్ద తప్పు వెలుగులోకి వచ్చింది.
క్రికెట్ మైదానంలో అంపైర్లు ప్రతీక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మ్యాచ్ సమయంలో జరిగే ప్రతి చర్యను గమనించాల్సి ఉంటుంది. ఏ చిన్న తప్పు జరిగినా.. మ్యాచ్ మొత్తం మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా, ఓ మ్యాచ్‌లో అంపైర్ చేసిన ఓ తప్పిదం.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. అది కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లో కావడంతో.. నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తు్న్నారు. జనవరి 27న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ (SA vs ENG) మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ చేసిన పెద్ద తప్పు వెలుగులోకి వచ్చింది.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. రెండు దేశాల మధ్య జనవరి 27న జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 27 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ ముర్రే ఎరాస్మస్ 24వ ఓవర్లో షార్ట్ లెగ్ వద్ద నిలబడి ఉన్నాడు. ఆన్రిచ్ నార్ట్జే వేసిన ఓవర్ మొదటి బంతిని జాసన్ రాయ్ ఆడాడు. అయితే, లెగ్ అంపైర్ ఎరాస్మస్ వ్యతిరేక దిశలో అంటే బౌండరీ వైపు చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అతను బిజీగా తన చేతిలో ఏదో చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. రాయ్ షాట్ ఆడగానే అంపైర్ దృష్టి మళ్లీ మ్యాచ్ పై పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ముర్రే ఎరాస్మస్ ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ అంపైర్‌లలో ఒకరిగా పేరుగాంచాడు.
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం..
What is Erasmus doing? #SAvENG pic.twitter.com/5vFzzgMGN0
— Badshah ? (@Badshah007007) January 27, 2023
ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ (111 పరుగులు, 117 బంతుల్లో) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది.
texting with kholi on WhatsApp
— Furqan (@OnlyCricket22) January 28, 2023
ఇంగ్లండ్‌కు కౌంటర్ ఇన్నింగ్స్‌లో జాసన్ రాయ్ (113 పరుగులు, 91 బంతుల్లో) అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడినా.. అతని ఇన్నింగ్స్ జట్టు ఓటమిని తప్పించలేకపోయింది. ఇంగ్లండ్ టీం 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్రికన్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..