AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: ఈ సారి సీన్ రివర్స్.. కేంద్ర బడ్జెట్‌పై రూటు మార్చనున్న మోదీ సర్కార్..?

కేంద్ర బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెడతారనే దానిపై కన్‌ప్యూజన్ నెలకొంది. ఈ సారి ఆదివారం రావడమే అందుకు కారణం. ఆదివారం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించరు. దీంతో బడ్జెట్ 1నే పెడతారా.. లేదా సోమవారానికి మారుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Venkatrao Lella
|

Updated on: Jan 07, 2026 | 11:13 AM

Share
కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర గందరగోళం నెలకొంది. ఎప్పటిలాగే రానున్న ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారా.. లేదా అనే దానిపై బిగ్ కన్‌ప్యూజన్ నెలకొంది. ఆ రోజును పెడతారా.. లేదా మరో రోజుకు మారుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 1న  ఈ సారి ఆదివారం వచ్చింది. ఆదివారం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలకు సెలవు రోజు కావడంతో.. బడ్జెట్ ఎప్పుడు పెడతారనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

1 / 5
ఆదివారం రావడంతో బడ్జెట్ తేదీ మారుస్తారనే ప్రచారం సర్వత్రా సాగుతోంది. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతీ ఏడాది అదే రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ ఈ సారి సండే రావడంతో సాంప్రదాయం పాటిస్తారా.. లేదా రూటు మారుస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

2 / 5
2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ సారి మార్చితే దానిని బ్రేక్ చేసినట్లు అవుతుంది. సాధారణంగా ఆదివారం పార్లమెంట్ సమావేశాలు జరగవు. ఏదైనా అత్యవసర పరిస్థితి మినహాయిస్తే ఆదివారం పార్లమెంట్ మీటింగ్స్ జరగవు.

3 / 5
ఈ క్రమంలో 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే పెట్టి సాంప్రదాయం పాటిస్తారా..? లేదా? ఫిబ్రవరి 2న సోమవారానికి మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. బడ్జెట్ తేదీకి సంబంధించి ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేంద్రం నుంచి ప్రకటన వస్తే కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

4 / 5
గతంలో అరుణ్ జైట్లీ ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2016లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020లో కరోనా టైమ్‌లో కూడా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. దీంతో  ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

5 / 5